MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడు రోహిత్, ఇప్పుడు జోస్ బట్లర్‌కి ప్రపోజ్ చేసిన చాహాల్... అందుకే ధనశ్రీ ఇలా చేస్తోందంటూ...

అప్పుడు రోహిత్, ఇప్పుడు జోస్ బట్లర్‌కి ప్రపోజ్ చేసిన చాహాల్... అందుకే ధనశ్రీ ఇలా చేస్తోందంటూ...

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఏ టీమ్‌లో ఉన్నా తన మార్కు చిలిపి చేష్టలతో చుట్టూ ఉన్నవారందరినీ నవ్విస్తూ ఉంటాడు యజ్వేంద్ర చాహాల్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న చాహాల్, మరోసారి అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 21 2023, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్, తన కూతుర్ని ఎత్తుకుని ఉండగా, అతని ముందు మోకాళ్ల మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

‘జోస్ భాయ్.. నువ్వు నా జీవితానికి ప్రేమ రూపానివి. గత ఏడాది నిన్ను కలిసినప్పుడే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ప్రతీ రాత్రి నిన్ను చూసినప్పుడు ఏదో ఫీల్ అవుతున్నా.. నువ్వు నాతో డేట్‌కి వస్తావా... ప్లీజ్’ అంటూ ప్రపోజ్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

39
Image credit: Instagram

Image credit: Instagram

కూతుర్ని ఎత్తుకుని, చాహాల్ అల్లరినంతా భరిస్తూ వచ్చిన జోస్ బట్లర్, ‘ఎస్... యూజీ కచ్ఛితంగా’ అంటూ సమాధానం చెప్పాడు. దీంతో చుట్టూ ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేట్స్ అందరూ చప్పట్లు కొట్టారు. చాహాల్ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు...

49

2021లో రోహిత్ శర్మకు కూడా ఇలాగే ఓ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. అప్పుడు రోహిత్ శర్మ భార్య రితికా... ‘నువ్వు మా ఆయనకు దూరంగా ఉండు ప్లీజ్’ అంటూ కామెంట్ చేయడం, ధనశ్రీ వర్మ అయితే ‘ఈ ఫోటోలు తీసింది నేనే.. క్రెడిట్ ఇవ్వు’ అంటూ అడగడం తెగ వైరల్ అయ్యాయి...

59
Chahal-Warner

Chahal-Warner

ఏదో ఒక్కసారి చేస్తే కామెడీ, కానీ మళ్లీ మళ్లీ అదే చేస్తుండడంతో జనాలు నవ్వాల్సింది పోయే, కామెంట్లతో యజ్వేంద్ర చాహాల్‌పై విరుచుకుపడుతున్నారు. కారణం కొన్నాళ్లుగా యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మ వ్యవహారం విడాకుల దాకా వెళ్లిందని ప్రచారం జరుగుతుండడమే...

69

పెళ్లికి ముందు నుంచే యజ్వేంద్ర చాహాల్ ఆడే ప్రతీ మ్యాచ్‌కి వచ్చి ఎంకరేజ్ చేసేది ధనశ్రీ వర్మ. అయితే ఈ ఏడాది ఆమె స్టేడియంలో కనిపించడం లేదు. అదీకాకుండా గాయంతో క్రికెట్‌కి దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్, ధనశ్రీ వర్మతో కలిసి ఓ ఇప్తార్ పార్టీలో కనిపించడంతో పెను దుమారం రేగింది...

79

యజ్వేంద్ర చాహాల్‌ భార్య ధనశ్రీ వర్మ, శ్రేయాస్ అయ్యర్‌తో చనువుగా ఉంటుండడంతో చాలా అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చాహాల్ ఇలా మగాళ్లకు ప్రపోజ్‌లు చేస్తుండడంతో వీరి కాపురం ఇలా తగలబడిందని చాలామంది కామెంట్లు చేస్తుండడం కొసమెరుపు... 

89

ఒకప్పుడు యజ్వేంద్ర చాహాల్ పోస్ట్ చేసే ప్రతీ పోస్టుకి ధనశ్రీ వర్మ స్పందించేది. అయితే ఇప్పుడు ధనశ్రీ ఇన్‌స్టాలో చాహాల్, చాహాల్‌ అకౌంట్‌లో ధనశ్రీ వర్మ పోస్టులు కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయమని టాక్ వినబడుతోంది..

99
Image credit: Dhanashree Verma/Instagram

Image credit: Dhanashree Verma/Instagram

గత సీజన్‌‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన యజ్వేంద్ర చాహాల్, ఈ ఏడాది కూడా పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. 6 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన చాహాల్, రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Recommended image2
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image3
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved