- Home
- Sports
- Cricket
- ముంబై ఇండియన్స్ విజయంతో ఆ టీమ్స్‌కి ఇక కష్టమే... ప్లేఆఫ్స్ రేసులో ఇక మిగిలిన ఆ ఒక్క ప్లేసే...
ముంబై ఇండియన్స్ విజయంతో ఆ టీమ్స్‌కి ఇక కష్టమే... ప్లేఆఫ్స్ రేసులో ఇక మిగిలిన ఆ ఒక్క ప్లేసే...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి, నాలుగే విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్. గత సీజన్‌లో ఆడిన జస్ప్రిత్ బుమ్రా కూడా ఈసారి అందుబాటులో లేడు. అయినా అంచనాలకు మించి, అదరగొడుతూ ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచింది ముంబై ఇండియన్స్...

గుజరాత్ టైటాన్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్, టాప్ 3లోకి వచ్చేసింది. టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది... 14 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉన్న ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు...
Image credit: PTI
ఐదోస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో పాటు ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ ఛాన్సులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే ఈ మూడింట్లో లక్నోకే ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు కాస్త ఎక్కువ...
Image credit: PTI
వర్షం కారణంగా సీఎస్‌కేతో మ్యాచ్ రద్దు కావడంతో 11 పాయింట్లతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, తర్వాతి మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కేకేఆర్‌లతో మ్యాచులు ఆడనుంది..
ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తూ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది లక్నో సూపర్ జెయింట్స్. అయితే గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీలతో మ్యాచులు ఓడిన లక్నో, మిగిలిన మ్యాచుల్లో అసాధారణ ఆటతీరు చూపిస్తూనే... ప్లేఆఫ్స్ చేరగలుగుతుంది..
Image credit: PTI
11 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తర్వాతి మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులు ఆడనుంది. ఈ మూడింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు..
(PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000369B)
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో ఐదు మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత 7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 6 విజయాలతో టాప్ 5లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, టాప్ 4లోకి వెళ్లాలంటే ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌లను చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది...
Image credit: PTI
11 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, తర్వాతి మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రెండు సార్లు, రాజస్థాన్ రాయల్స్‌తో ఓ మ్యాచ్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ కూడా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొస్తుంది..
Image credit: PTI
10 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇంకా లీగ్‌లో 4 మ్యాచులు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌లతో మ్యాచులు ఆడనుంది ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచుల్లో గెలిస్తే 9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్ 4లోకి దూసుకొస్తుంది...
(PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000457B)
11 మ్యాచుల్లో 4 విజయాలతో ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, 12 మ్యాచుల్లో 5 విజయాలతో టాప్ 7లో ఉన్న కేకేఆర్ ప్లేఆఫ్స్ ఛాన్సులు చాలా తక్కువ. కేకేఆర్ తర్వాతి మ్యాచుల్లో సీఎస్‌కే, లక్నోలతో మ్యాచులు ఆడుతుంది. ఈ రెండూ గెలిస్తే 14 పాయింట్లతో ఉంటుంది. అయినా ప్లేఆఫ్స్ చేరడం కష్టమే..
Image credit: PTI
ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు 0.1 శాతం మాత్రమే. అయితే పంజాబ్ కింగ్స్, సీఎస్‌కేలతో మ్యాచులు ఆడనున్న ఢిల్లీ, గేమ్ ఛేంజర్‌గా మారనుంది..