MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 6 మ్యాచుల్లో రెండే విజయాలు... ఇలా అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరినట్టే! ఏరికోరి తెచ్చుకున్న...

6 మ్యాచుల్లో రెండే విజయాలు... ఇలా అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరినట్టే! ఏరికోరి తెచ్చుకున్న...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. మొదటి 8 సీజన్లలో రెండు సార్లు  ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐదు సార్లు ఫ్లేఆఫ్స్ ఆడింది. అయితే అది గతం. 2021 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని బ్యాడ్ లక్ జిడ్డులా పట్టి పీడిస్తోంది...

3 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 22 2023, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండో క్వాలిఫైయర్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2021 సీజన్‌లో తొలి 5 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్‌ని ఎలా ఓడిపోవాలో బాగా తెలిసినట్టు ఓడింది ఆరెంజ్ ఆర్మీ. టీమ్ మేనేజ్‌మెంట్ గొడవలు, కెప్టెన్సీ మార్పులతో డేవిడ్ వార్నర్‌.. టీమ్ నుంచి వెళ్లిపోయాడు..

212

2022 సీజన్‌లో టీమ్‌ మొత్తాన్ని సాగనంపిన టీమ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకుంది. మెగా వేలంలో కొత్త టీమ్‌ని తయారుచేస్తారని అనుకుంటే.. మళ్లీ అదే భువీ, అదే నటరాజన్ అంటూ పాత పాటనే పాడారు..

312

2022 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కేన్ విలియంసన్‌ని కూడా సాగనంపింది. సౌతాఫ్రికా20లో సన్‌రైజర్స్ ఈస్టరన్ క్యాప్‌కి టైటిల్ అందించిన అయిడిన్ మార్క్‌రమ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు..

412
Image credit: PTI

Image credit: PTI

2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2021 సీజన్‌లో 441 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, అంతకుముందు సీజన్‌లో 424 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్‌గా 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 196 పరుగులే చేశాడు. 

512

కెప్టెన్సీ భారం వల్లే మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడని, అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ. టీమ్‌లో సీనియర్ ఇండియన్ బ్యాటర్‌గా మయాంక్, టీమ్‌కి బ్యాక్ బోన్ అవుతాడని ఆశించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోనూ ఇదే ఫ్లాప్ పర్ఫామెన్స్ కొనసాగిస్తున్నాడు మయాంక్ అగర్వాల్..
 

612
Image credit: PTI

Image credit: PTI

ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో రికార్డులు కొల్లగొడుతున్న హారీ బ్రూక్‌ని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. హారీ బ్రూక్ ఆడిన 20 టీ20 మ్యాచుల్లో 372 పరుగులే చేశాడు. టెస్టు రికార్డులు చూసి భారీ ధర పెట్టి కొన్నా, అతని బ్యాటు నుంచి ఒకే ఒక్క మ్యాచ్‌లో సెంచరీతో మెరుపులాంటి ఇన్నింగ్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తుస్సే... 
 

712

టెస్టుల్లో 80+ యావరేజ్ ఉందని హారీ బ్రూక్ నుంచి భారీగా ఆశించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అది వ్యూహాత్మక తప్పిదమే కానీ హారీ తప్పు కాదు. అతన్ని ఓపెనర్‌గా ఆడించడం తప్పని కూడా విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకుముందు సన్‌రైజర్స్‌కి భారంగా మారిన రొమారియో షెఫర్డ్, నికోలస్ పూరన్‌... ఇప్పుడు లక్నోకి బలంగా మారారు...
 

812

ధృవ్ జురెల్, సుయాశ్ శర్మ వంటి యంగ్‌స్టర్స్, అంచనాలకు మించి రాణిస్తున్నారు. సన్‌రైజర్స్‌లోనూ టీమ్‌లో కార్తీక్ త్యాగి, మయాంక్ మర్కండే వంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. మొదటి రెండు మ్యాచుల తర్వాత మయాంక్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కార్తీక్ త్యాగిని మాత్రం రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది.
 

912

మొత్తానికి టీమ్ మారింది, టీమ్ మేనేజ్‌మెంట్ మారింది, కానీ ఆట మాత్రం మారడం లేదు...డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు టీమ్‌లో ఉన్నప్పుడు ఐపీఎల్ వేలానికి వెళ్లినా టీ, బిస్కెట్స్ టేస్ట్ చేయడానికే ఎక్కవ ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్. 

1012
Image credit: PTI

Image credit: PTI

2021 మినీ వేలంలో ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసిన ప్లేయర్లు ముగ్గురే. వాళ్లు కూడా ముజీబ్, కేదార్ జాదవ్, జగదీశ సుచిత్ వంటి ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ పట్టించుకోని ప్లేయర్లే..

1112

ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ మారడంతో టీ, బిస్కెట్ల పైనే కాకుండా ప్లేయర్లను కొనుగోలు చేయడంలో కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ దరిద్రం ఏంటో కానీ ఏరి కోరి సన్‌రైజర్స్ కొంటున్న ప్లేయర్లు ఫెయిల్ అవుతున్నారు. వేరే టీమ్స్ తరుపున బాగా ఆడిన ప్లేయర్లు కూడా, ఆరెంజ్ ఆర్మీలోకి రాగానే తేలిపోతున్నారు..

1212

మొదటి 6 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచుల్లో కనీసం 6 విజయాలు అందుకోవాలి. ఫస్టాఫ్‌లో మనోళ్ల ఆట చూసిన తర్వాత బత్తాయి టీమ్ నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుందని ట్రోల్స్ వినిపిస్తున్నాయి..  

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Recommended image2
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Recommended image3
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved