- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో జింబాబ్వే ప్లేయర్ ముజరబానీ... మార్క్ వుడ్ ప్లేస్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌లోకి!...
ఐపీఎల్‌లో జింబాబ్వే ప్లేయర్ ముజరబానీ... మార్క్ వుడ్ ప్లేస్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌లోకి!...
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జెయింట్స్‌కి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో మొదటి టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన మార్క్ వుడ్, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ కూడా ఆడడం లేదని కన్ఫార్మ్ చేశాడు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ని రూ.7.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 150+ కి.మీ.ల వేగంతో నిప్పులు చెదిరే బంతులు వేసే మార్క్ వుడ్, లక్నోకి బలం అవుతాడని భావించింది...
మార్క్ వుడ్ గాయపడి, సీజన్‌కి దూరమవుతున్నట్టు ప్రకటించి 4 రోజులు అవుతున్నా... ఇంకా అతని ప్లేస్‌లో ఏ ప్లేయర్‌ని తీసుకుంటున్నది అధికారికంగా ప్రకటించలేదు లక్నో సూపర్ జెయింట్స్..
మార్క్ వుడ్ స్థానంలో బంగ్లాదేశ్ యంగ్ పేసర్ టస్కిన్ అహ్మద్‌ను తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బంగ్లాదేశ్ షెడ్యూల్ కారణంగా అతను ఐపీఎల్ పూర్తి సీజన్‌కి అందుబాటులో కష్టమేనని తేలింది...
మార్క్ వుడ్ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టైని తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2018 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడి 24 వికెట్లు తీసి, పర్పుల్ క్యాప్ గెలిచాడు ఆండ్రూ టై...
అయితే ఆ తర్వాతి సీజన్లలో ఆండ్రూ టై నుంచి సరైన పర్ఫామెన్స్ రాకపోవడంతో ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఏ జట్టూ కూడా ఆండ్రూ టైని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...
అలాగే మార్క్ వుడ్ స్థానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ, ఐపీఎల్ ఆడబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైన ఓ ఫోటో...
ఐపీఎల్ కోసం భారత్‌కి బయలుదేరిన బ్లెస్సింగ్ ముజరబానీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది జింబాబ్వేలోని భారత రాయభార కార్యాలయం. దీంతో ముజరబానీ, మార్క్ వుడ్ స్థానంలో ఆడబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది...
లక్నో సూపర్ జెయింట్స్‌కి కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ ప్లవర్ కోచింగ్‌లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకి పాక్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు బ్లెస్సింగ్ ముజరబానీ... ఫ్లవర్ రికమెండేషన్‌తోనే ముజరబానీకి లక్నోలో చోటు దక్కిందనే ప్రచారం జరుగుతోంది...
8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడబోతున్న జింబాబ్వే ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు బ్లెస్సింగ్ ముజరబానీ. 2014 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, ఐపీఎల్ ఆడాడు...
అంతకుముందు 2008లో టటేండ తైబు, కేకేఆర్ తరుపున ఐపీఎల్ ఆడగా... ఐపీఎల్ 2011 సీజన్‌లో రే ప్రైస్, ముంబై ఇండియన్స్ తరుపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నారు...