- Home
- Sports
- Cricket
- షేన్ వార్న్, ఆ రోజు మమ్మల్ని హోటల్ దాకా నడిపించాడు... యూసఫ్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్...
షేన్ వార్న్, ఆ రోజు మమ్మల్ని హోటల్ దాకా నడిపించాడు... యూసఫ్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కి అర్హత సాధించింది. 2008 ఆరంగ్రేటం సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 2008లో జట్టుకు టైటిల్ అందించిన షేన్ వార్న్ కొంతకాలం క్రితం ప్రాణాలు కోల్పోవడంతో ఆయనకి టైటిల్ గెలిచి, ఘనమైన నివాళి ఇవ్వాలని పట్టుదలతో ఉంది రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ 2008 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్. అయితే అద్భుత ఆటతీరుతో ఊహించని విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచి, టైటిల్ కైవసం చేసుకుంది...
2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 16 మ్యాచుల్లో 179.01 స్ట్రైయిక్ రేటుతో 435 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 8 వికెట్లు పడగొట్టి, రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...
‘ప్రాక్టీస్ సెషన్స్ మిస్ అయినందుకు షేన్ వార్న్ మమ్మల్ని శిక్షించినట్టు అయితే నాకు గుర్తులేదు కానీ ఓ సారి కమ్యూనికేషన్ లోపం వల్ల మేం ఓ పూల్ సెషన్‌ని మిస్ అయ్యాం...
అంతే మేం హోటల్‌కి వెళ్లేందుకు టీమ్ బస్సు ఎక్కుతుంటే, పూల్ సెషన్స్ మిస్ చేసినందుకు శిక్షగా నడుచుకుంటూ రావాలని వార్న్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి...
Yousuf Pathan
అప్పుడు బస్సులో నాతో పాటు రవీంద్ర జడేజా, ఇంకా కొందరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. చేసేదేమీ లేక నడుచుకుంటూ హోటల్‌కి వెళ్లాం... షేన్ వార్న్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
వార్న్ ఎప్పుడూ నేను తన మనిషిగా చెప్పేవాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పగలనని, ఎలాంటి మ్యాచ్‌లనైనా గెలిపించగలనని నమ్మేవారు. ఐపీఎల్‌కి రావడానికి ముందే వార్న్, నా ఆటను చదివాడు, అర్థం చేసుకున్నాడు...
అందుకే నాకు నచ్చినట్టుగా ఆడనిచ్చేవాడు. షేన్ వార్న్ కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. నాపైన అంత నమ్మకం ఉండేది ఆయనకి. అందుకే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కానీ ఫైనల్ మ్యాచ్‌లో కానీ భయం లేకుండా ఆడగలిగాను...
షేన్ వార్న్ నాలో నింపిన ఆత్మవిశ్వాసాన్ని వెలకట్టలేను. ఆయనకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు యూసఫ్ పఠాన్...