ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు అసలు కారణం ఇదే... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...
ఫైవ్ టైమ్ టైటిల్ విన్నింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు పరాజయాలను అందుకుంది. ఆనవాయితీ ప్రకారం మొదటి మ్యాచ్ ఓడిన ముంబై, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి సీఎస్‌కేతో కలిసి తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది...

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్, తుదిజట్టులో రకరకాల మార్పులు చేస్తున్నా ఫలితం మాత్రం ఆశించిన విధంగా రావడం లేదు...
Jasprit Bumrah
ఐపీఎల్ 2022 సీజన్‌కి అందుబాటులో ఉండడని తెలిసినా, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్ గురించి పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తోంది...
‘ముంబై ఇండియన్స్‌కి ఇలాంటి పొజిషన్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. 2014, 2015 సీజన్లలోనూ ఇలాంటి పరాజయాల తర్వాతే కమ్‌బ్యాక్ ఇచ్చారు. 2015లో అయితే వరుసగా మ్యాచులు ఓడి టైటిల్ గెలిచారు...
అయితే అప్పటి టీమ్‌తో పోలిస్తే ఇప్పటి జట్టు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది బుమ్రాకి సపోర్ట్ చేసే బౌలర ఎవ్వరూ కనిపించడం లేదు...
Rohit Sharma
అయితే అప్పటి టీమ్‌తో పోలిస్తే ఇప్పటి జట్టు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది బుమ్రాకి సపోర్ట్ చేసే బౌలర ఎవ్వరూ కనిపించడం లేదు...
కెప్టెన్ రోహిత్ శర్మకి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. అయితే బ్యాటింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. తిలక్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు... సూర్యకుమార్ యాదవ్ కమ్‌బ్యాక్‌తో అదరగొట్టాడు.
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్ వంటి బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తే... ముంబై బ్యాటింగ్‌కి తిరుగే ఉండదు. అయితే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మాత్రం బలహీనంగా ఉంది.
మహారాష్ట్ర పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి. మురుగన్ అశ్విన్ స్పిన్‌తో రాణిస్తున్నా, ఫాస్ట్ బౌలర్లు ఫెయిల్ అవ్వడమే ముంబై వరుస పరాజయాలకు ప్రధాన కారణం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
జస్ప్రిత్ బుమ్రాతో పాటు బాసిల్ తంపి, తైమల్ మిల్స్, డానియల్ సామ్స్, జయ్‌దేవ్ ఉనద్కడ్ వంటి ఫాస్ట్ బౌలర్లను ప్రయత్నించింది ముంబై. అయితే ఎవ్వరూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు.