- Home
- Sports
- Cricket
- రవీంద్ర జడేజా తర్వాత నువ్వే... రవిశాస్త్రి చెప్పిన త్రీ ఫార్మాట్ ఫ్యూచర్ ఆల్‌రౌండర్ ఎవరంటే...
రవీంద్ర జడేజా తర్వాత నువ్వే... రవిశాస్త్రి చెప్పిన త్రీ ఫార్మాట్ ఫ్యూచర్ ఆల్‌రౌండర్ ఎవరంటే...
33 ఏళ్ల వయసులో ఐపీఎల్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రవీంద్ర జడేజా. అయితే ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ, ఐపీఎల్ 2022 సీజన్ ఓ పీడకలనే మిగిల్చింది. సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయి, గాయంతో జట్టుకి దూరమైన రవీంద్ర జడేజా... గత ఏడాదిన్నరలో మూడు సార్లు గాయపడి, టీమ్‌లో చోటు కోల్పోయాడు...

ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, రెండో టెస్టు సమయానికి అందుబాటులోకి వచ్చినా, మళ్లీ మూడో టెస్టులో గాయపడి... టీమిండియాకి దూరమయ్యాడు...
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లోనూ గాయంతో బరిలో దిగని రవీంద్ర జడేజా... న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలోనూ గాయంతో రెండో టెస్టుకి అందుబాటులో ఉండలేకపోయాడు...
కెరీర్ పీక్ స్టేజీలో గాయాలు రవీంద్ర జడేజాని బాగా ఇబ్బందిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో రవీంద్ర జడేజా మహా అయితే మరో మూడేళ్లు ఆడగలడేమో. మరి జడ్డూ తర్వాత ఆ ప్లేస్ ఎవరిది?..
Ravindra Jadeja
‘వాషింగ్టన్ సుందర్... టీమిండియా పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అవుతాడు. అతనే టీమిండియా ఫ్యూచర్. ఇప్పుడు రవీంద్ర జడేజా రూపంలో ఓ స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. అయితే మూడేళ్ల తర్వాత ఎవరు?
ఫిట్‌గా ఉంటే జడ్డూ ఇంకా ఆడగలడేమో. అలాగే అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అయితే మూడు ఫార్మాట్లు ఆడగల ఆల్‌రౌండర్ మాత్రం వాషింగ్టన్ సుందరే... అతను చాలా సీరియస్ క్రికెటర్...
సుందర్ ఇంకా కుర్రాడే. తన ఆటను అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా ఇంకా రాలేదు, అయితే అతను ఆడే విధానం చూస్తుంటే... ముచ్చటేస్తుంది. ముఖ్యంగా సుందర్ షాట్ సెలక్షన్ సూపర్...
టెస్టుల్లోనే కాదు, వైట్ బాల్ క్రికెట్‌లోనూ సుందర్ షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అయితే అతను ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి. టీ20ల్లో ఆడాలంటే టీమ్‌కి ఎప్పుడూ అందుబాటులో ఉండగలగాలి...
టెస్టుల్లో ఆరు, ఏడు స్థానాల్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడగలడు. అతను మొదటి టెస్టులోనే ఆస్ట్రేలియాలో 60+ చేశాడు. ఇంగ్లాండ్‌పై 96 కొట్టి నాటౌట్‌గా నిలిచాడు...
17 ఫస్ట్ క్లాస్ మ్యాచులు మాత్రమే ఆడిన వాషింగ్టన్ సుందర్, వరల్డ్ క్లాస్ బౌలర్లను ఇంత బాగా ఆడగలడని ఎవ్వరైనా ఊహించగలరా?’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ఆస్ట్రేలియాలో జరిగిన బ్రిస్బేన్ టెస్టులో ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్, ఆ టెస్టులో శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 123 పరుగులు జోడించాడు. 4 టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలతో 265 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, 6 వికెట్లు పడగొట్టాడు. 4 వన్డేల్లో 57 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు...