- Home
- Sports
- Cricket
- ఈ టైంలో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చేదే లే! సౌతాఫ్రికా సిరీస్‌లో... టీ20 వరల్డ్ కప్‌కి ముందు...
ఈ టైంలో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చేదే లే! సౌతాఫ్రికా సిరీస్‌లో... టీ20 వరల్డ్ కప్‌కి ముందు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా ఫ్యాన్స్‌ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న విషయం భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్. ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నడూలేనట్టుగా రెండు సార్లు రనౌట్, వరుసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ.. ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీని రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...
‘ఇలాంటి మెంటల్ ప్రెషర్‌తో ఆడడం కంటే విరాట్ కోహ్లీ నెలన్నర లేదా రెండు నెలల పాటు క్రికెట్‌కి పూర్తిగా దూరంగా ఉండడం చాలా బెటర్. అవసరమైతే ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకో...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
అయితే బీసీసీఐ సెలక్టర్లు మాత్రం ఈ టైమ్‌లో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదట. ఫామ్ కోల్పోయి, ఘోరంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా టూర్‌లో ఆడి ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా టీమిండియా మేనేజ్‌మెంట్ సూచించారట.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పెద్దగా సమయం లేదు. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీతో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు...
అదీకాక ఐపీఎల్ కారణంగా టీమ్‌లో ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్న ప్లేయర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మూడో ప్లేస్ కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్... విరాట్‌తో పోటీపడుతున్నారు.
కోహ్లీ ఫామ్ మరీ దారుణంగా ఉండడంతో ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో పాల్గొనాలని బీసీసీఐ కోరిందట. దానికి విరాట్ కూడా అంగీకరించాడట...
భారత జట్టుకి కోహ్లీ చేసిన సేవలకు ప్రతిఫలంగా అతను తప్పుకోవాలని నిర్ణయించుకుంటే తప్ప, విరాట్‌ని జట్టు నుంచి తప్పించేందుకు బీసీసీఐ సెలక్టర్లు కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ సాహసం చేయడానికి ఇష్టపడడం లేదని ఓ అధికారి తెలియచేశారు...
విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా వంటి ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫెయిల్ అవుతున్న ప్లేయర్లు కూడా సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడబోతున్నట్టు సమాచారం...
వీరితో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లకు సౌతాఫ్రికా సిరీస్‌లో అవకాశం దొరకబోతున్నట్టు సమాచారం.