- Home
- Sports
- Cricket
- డబ్బులు పోతే పోయాయి, ఐపీఎల్ నుంచి తప్పుకో! నీకు ఇప్పుడది చాలా అవసరం... కోహ్లీకి రవిశాస్త్రి సలహా...
డబ్బులు పోతే పోయాయి, ఐపీఎల్ నుంచి తప్పుకో! నీకు ఇప్పుడది చాలా అవసరం... కోహ్లీకి రవిశాస్త్రి సలహా...
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికీ భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి టీమిండియాని టాప్ టీమ్‌గా మార్చారు. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకున్నాక విరాట్ కోహ్లీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది...

టీమిండియా కెప్టెన్సీతో పాటు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీకి కూడా రాజీనామా చేసిన విరాట్ కోహ్లీ, సాధారణ ప్లేయర్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో బరిలో దిగుతున్నాడు. అయితే కోహ్లీకి ఈ సీజన్ ఓ పీడకలను మిగిల్చేలా కనిపిస్తోంది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 119 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, రెండు సార్లు రనౌట్ అయ్యారు. మరో రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు...
ప్రతీ మ్యాచ్‌కి ముందు కోహ్లీ బ్యాటు నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ వస్తుందని అతని ఫ్యాన్స్ ఆశపడడం, విరాట్ త్వరగా అవుటై వారిని తీవ్రంగా నిరాశపరచడం కొనసాగుతూ వస్తోంది...
‘విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్రేక్ చాలా అవసరం. డబ్బులు పోతే పోయాయి, ఐపీఎల్ నుంచి తప్పుకో. హాయిగా విశ్రాంతి తీసుకో. ఎందుకంటే ఇలాంటి ఫ్రై బ్రేయిన్‌తో క్రికెట్ ఆడడం వల్ల మొదటికే మోసం వస్తుంది...
నాకు తెలిసి విరాట్ కోహ్లీ మరో 7-8 ఏళ్లు క్రికెట్ ఆడగలడు.కాబట్టి రెండు నెలలో లేక నెలన్నరో బ్రేక్ తీసుకుని, హాయిగా కుటుంబంతో గడిపి తిరిగి వస్తే బెటర్...
బ్రేక్ ఇప్పుడు తీసుకోవాలా? లేక ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత లేక అంతకుముందే తీసుకోవాలా? అనేది విరాట్ కోహ్లీ ఇష్టం... కానీ ఆలస్యం కాకముందే విశ్రాంతి అవసరమనే విషయాన్ని గుర్తిస్తే బెటర్...
నా ఉద్దేశంలో బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ బెస్ట్ ఇంకా రాలేదు, అది బయటికి రావాలంటే బ్రేక్ తప్పనిసరి... ’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...