- Home
- Sports
- Cricket
- సన్‌రైజర్స్‌కి ఊహించని షాక్... ఆరెంజ్ ఆర్మీ తీరునచ్చక బ్యాటింగ్ కోచ్ సిమాన్ కటిచ్ రాజీనామా...
సన్‌రైజర్స్‌కి ఊహించని షాక్... ఆరెంజ్ ఆర్మీ తీరునచ్చక బ్యాటింగ్ కోచ్ సిమాన్ కటిచ్ రాజీనామా...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఏ స్ట్రాటెజీ లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేసిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆరెంజ్ ఆర్మీ, మెగా వేలంలో కొనుగోలు చేసిన జట్టుతో అసంతృప్తి చెందిన బ్యాటింగ్ కోచ్ సిమాన్ కటిచ్, తన పదవికి రాజీనామా చేశాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆ తర్వాత అతనికి తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వకుండా ఘోరంగా అవమానించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
14 మ్యాచుల్లో 11 పరాజయాలు అందుకున్న ఆరెంజ్ ఆర్మీ, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి, అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు కెప్టెన్ కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వేలానికి వదిలిసింది సన్‌రైజర్స్...
భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ వంటి ఒకరిద్దరు ప్లేయర్లు మినహా పూర్తిగా కొత్త జట్టుతో ఐపీఎల్ 2022 సీజన్‌లో బరిలో దిగబోతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
మెగా వేలం ముగిసి వారం కూడా కాకముందే ఆరెంజ్ ఆర్మీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ కోచ్ సిమాన్ కటిచ్, తన పదవికి రాజీనామా సమర్పించాడు...
ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన ప్లేయర్లతో అసంతృప్తి చెందడం వల్లే సిమాన్ కటిచ్, ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం...
వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా, భారత మాజీ క్రికెటర్ హిమాంగ్ బదానీ, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్‌లతో కలిసి సన్‌రైజర్స్ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న సిమాన్ కటిచ్, తన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది...
అయితే సన్‌రైజర్స్ మాత్రం బయో బబుల్, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే సిమాన్ కటిచ్, తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించింది..
సిమాన్ కటిచ్ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ సిమాన్ హెల్మోట్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో నికోలస్ పూరన్‌ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, వాషింగ్టన్ సుందర్‌ని రూ.8.75 కోట్లు, రాహుల్ త్రిపాఠిని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది...
యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను రూ.6.75 కోట్లకు కొన్న ఆరెంజ్ ఆర్మీ, విండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్‌ను రూ.7.75 కోట్లకు సొంతం చేసుకుంది...