- Home
- Sports
- Cricket
- అతని కెప్టెన్సీ పోవడానికి ఏదో కారణముంది... శ్రేయాస్ అయ్యర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...
అతని కెప్టెన్సీ పోవడానికి ఏదో కారణముంది... శ్రేయాస్ అయ్యర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్సీ కోల్పోయినవారిలో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఒకడు. 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా తప్పించడానికి ఏదో తెలియని కారణముందని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. అతనికి మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఐపీఎల్‌కి దూరమయ్యాడు...
అయితే అతని అదృష్టవశాత్తు ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా బ్రేక్ పడడంతో తిరిగి సెప్టెంబర్‌లో సెకండాఫ్ నిర్వహించారు...
ఫస్టాఫ్‌లో గాయం కారణంగా ఆడలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, సెకండ్ ఫేజ్ సమయానికి పూర్తిగా కోలుకుని, జట్టుకి అందుబాటులోకి వచ్చినా కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్..
ఫస్టాఫ్‌లో శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీలో రిషబ్ పంత్ జట్టును నడిపించిన తీరును మెచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్, సెకండ్ ఫేజ్‌లోనే అతన్నే కెప్టెన్‌గా కొనసాగించింది...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు శ్రేయాస్ అయ్యర్, టీమ్‌ను వదిలి, వేరే జట్టు తరుపున ఆడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం...
రిషబ్ పంత్, పృథ్వీషా, అక్షర్ పటేల్, అన్రీచ్ నోకియాలను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అట్టిపెట్టుకోనుందని... శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వంటి సీనియర్లు కూడా వేలంలో పాల్గొనబోతున్నారని టాక్..
‘శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అద్భుతంగా నడిపించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ రాణిస్తున్నాడు. అయినా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు...
అయ్యర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనక జనాలకి తెలియని ఏదో తతంగం నడిచే ఉంటుంది. అయితే ఇది శ్రేయాస్ అయ్యర్‌కి చాలా మంచి అవకాశం...
కొత్త ఫ్రాంఛైజీకి వెళ్లి కొత్త జట్టును నడిపించే అవకాశం అందుకంటే, అతను భవిష్యత్తు కెప్టెన్‌గా కూడా మారవచ్చు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కెప్టెన్ ఫార్ములా మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ని, పంజాబ్ కింగ్స్ జట్టు కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా నియమించినట్టే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్‌ని కెప్టెన్ చేసి ఉంటుందని విశ్లేషకుల అంచనా...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా భావి కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను పరిగణించేందుకు వీలుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ, అయ్యర్‌కి దక్కకుండా బీసీసీఐ పెద్దలు పావులు కదిపారని కూడా సోషల్ మీడియా టాక్...