- Home
- Sports
- Cricket
- సురేశ్ రైనా, నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ కార్తీక్ త్యాగి...
సురేశ్ రైనా, నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ కార్తీక్ త్యాగి...
ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు ఇవ్వకుండా నియంత్రించి, ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు కార్తీక్ త్యాగి. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న కార్తీక్ త్యాగి... ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, భువీ వంటి సీనియర్ల కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు కూడా దక్కించుకున్న కార్తీక్ త్యాగి... 2020 ఆస్ట్రేలియా టూర్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఆడాడు...
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో బౌలింగ్‌కి వచ్చిన కార్తీక్ త్యాగి... మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్ తీశాడు మార్క్‌రమ్...
మూడో బంతికి నికోలస్ పూరన్ అవుట్ కాగా నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి దీపక్ హుడాని అవుట్ చేసిన కార్తీక్ త్యాగి... ఆఖరి బంతిని కూడా డాట్‌గా మలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
‘నేను అండర్ 16 క్రికెట్ ఆడుతున్నప్పుడు నా జీవితంలోకి సురేశ్ రైనా దేవుడిలా వచ్చాడు. ఎందుకంటే నేనేంటో ప్రపంచానికి పరిచయమైంది రైనా వల్లే...
నేను రంజీ ట్రోఫీలోకి వచ్చినప్పుడు నేను 16 ఏళ్ల కుర్రోడిని. జట్టులో అందరూ అప్పటికే బాగా సీనియర్లు. ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నవాళ్లు...
సురేష్ రైనా ఓ రోజు ప్రాక్టీస్ సెషన్స్‌కి వచ్చాడు. నేను సైలెంట్‌గా ఓ మూలకి కూర్చొని, అన్నీ గమనిస్తూ ఉంటాను. ప్రాక్టీస్ తర్వాత ఆయన వెళ్లిపోయాడు...
అయితే ఆ తర్వాత కాసేపటికి రైనా తిరిగి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, నీ రోల్ ఏంటని అడిగాడు. నేను బౌలర్‌ని చెప్పాను.. సరే, నాకు బౌలింగ్ వేయమని చెప్పాడు...
నేను, రైనాకి నెట్స్‌లో బౌలింగ్ చేశా. నా పర్ఫామెన్స్ చూసిన ఆయన... ‘నీ బౌలింగ్ నాకు నచ్చింది. నీకు తప్పకుండా ఛాన్సులు వస్తాయి... నాదీ గ్యారెంటీ’ అని చెప్పి వెళ్లిపోయారు...
అంత పెద్ద ప్లేయర్ నన్ను మెచ్చుకోవడంతో నేను షాక్ అయ్యా, చాలా సంతోషించా. రైనాకి నా పర్పామెన్స్ నచ్చిందని మురిసిపోయా. అయితే ఆయన జోక్ చేసుకున్నారేమో అనే అనుమానం కూడా వచ్చింది...
ఆ తర్వాత రంజీ ట్రోపీ ఆడే యూపీ జట్టులో నా పేరు షార్ట్ లిస్టు చేయబడింది. నా రంజీ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత అండర్ 19 ప్లేయర్‌గా, అండర్ 19 వరల్డ్ కప్ ఆడేదాకా వెళ్లా. అటు నుంచి ఐపీఎల్...’ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ త్యాగి...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో యంగ్ పేసర్ కార్తీక్ త్యాగిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఆరెంజ్ ఆర్మీలో టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లు ఉండడంతో కార్తీక్ త్యాగికి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...