MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కాబోయే మామగారి రికార్డు సమం చేసిన శుబ్‌మన్ గిల్... టెండూల్కర్‌కి మాత్రమే సాధ్యమైన...

కాబోయే మామగారి రికార్డు సమం చేసిన శుబ్‌మన్ గిల్... టెండూల్కర్‌కి మాత్రమే సాధ్యమైన...

Shubman Gill: నిజమో కాదో తెలీదు కానీ శుబ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఎన్నో ఏళ్లుగా ప్రచారం నడుస్తోంది. అసలు ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో కానీ ఈ పుకారు... శుబ్‌మన్ గిల్‌ని సచిన్ టెండూల్కర్‌ని సోకాల్డ్ అల్లుడిని చేసేసింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 10 2022, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరీ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా నాలుగు హాఫ్ సెంచరీలతో డీసెంట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్...

29

టీ20ల్లో టెస్టు బ్యాటింగ్ చేస్తాడనే అపవాదు మోసిన శుబ్‌మన్ గిల్, కేకేఆర్ రిటెన్షన్ కార్డు పొందలేకపోయాడు. అయితే గిల్‌ని ఏకంగా రూ.8 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

39
Shubman Gill

Shubman Gill

టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడే శుబ్‌మన్ గిల్‌కి అంత భారీ మొత్తం ఖర్చు చేయడం అనవసరమని అభిప్రాయపడ్డారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే సీజన్‌లో గిల్ పర్ఫామెన్స్ ‘పైసా వసూల్’ అన్నట్టుగా సాగింది...

49

ఆరంభమ్యాచుల్లో అదరగొట్టిన తర్వాత సచిన్ టెండూల్కర్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్‌పై హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్... లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా రెండో 50+ స్కోరు నమోదు చేశాడు...

59

49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...

69

2009లో చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ టెండూల్కర్... 49 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్ల పాటు క్రీజులో బ్యాటింగ్ చేసినా టెండూల్కర్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం..

79
Shubman Gill

Shubman Gill

తాజాగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, మామగారిని ఫాలో అవుతూ సరిగ్గా 7 ఫోర్లు బాది, ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు...

89

సచిన్ టెండూల్కర్ తర్వా త ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఒక్క సిక్సర్ కూడా కొట్టని రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్...

99

సచిన్ టెండూల్కర్ ఆడిన ఆ ఇన్నింగ్స్‌లో ముంబై ఇండియన్స్, సీఎస్‌కేని 166 పరుగుల లక్ష్యఛేదనలో 146 పరుగులకి నిలువరించి విజయం అందుకుంటే... శుబ్‌మన్ గిల్ ఆడిన తాజా ఇన్నింగ్స్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, 145 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌ని 82 పరుగులకి ఆలౌట్ చేసి అద్భుత విజయం అందుకోవడం విశేషం.

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image2
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Recommended image3
IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved