- Home
- Sports
- Cricket
- శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్ త్రో, ఎగిరిపడిన మిడిల్ వికెట్... కెఎల్ రాహుల్ ఖాతాలో డైమండ్ డక్...
శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్ త్రో, ఎగిరిపడిన మిడిల్ వికెట్... కెఎల్ రాహుల్ ఖాతాలో డైమండ్ డక్...
కేకేఆర్‌తో మ్యాచ్‌లో డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్... సీజన్‌లో మూడో డకౌట్ నమోదు...

టీమిండియా తరుపున ఎలా ఆడుతున్నా ఐపీఎల్‌లో మాత్రం నిలకడైన ప్రదర్శన ఇస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తూ వస్తున్నాడు కెఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్, కేకేఆర్‌లో మ్యాచ్‌లో చెత్త రికార్డు క్రియేట్ చేశాడు...
2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, 2021 సీజన్‌లో 626 పరుగులు చేశాడు. 2022 సీజన్‌లోనూ రెండు సెంచరీలతో 451 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...
అయితే 2022 సీజన్‌లో గోల్డెన్ డకౌట్‌తో ప్రారంభించాడు కెఎల్ రాహుల్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే, తన మాజీ టీమ్ మేట్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రాహుల్...
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు కెఎల్ రాహుల్. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు రాహుల్...
తాజాగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే డైమండ్ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్.
క్వింటన్ డి కాక్ కాల్‌ని అపార్థం చేసుకున్న కెఎల్ రాహుల్, పరుగు తీసేందుకు సగం క్రీజు వరకూ ముందుకు వచ్చేశాడు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి, వెనక్కి వెళ్లేలోపు మెరుపు వేగంతో బంతిని అందుకున్న శ్రేయాస్ అయ్యర్, డైరెక్ట్ త్రోతో మిడిల్ వికెట్‌ని ఎగిరేశాడు...
కేకేఆర్ కెప్టెన్ సూపర్ త్రోకి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ డైమండ్ డకౌట్ అయ్యాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలిచాడు కెఎల్ రాహుల్...
ఇంతకుముందు 2012లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్, 2014లో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, 2014లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2018లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, 2018లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయ్యారు...
గత సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయిన కేకేఆర్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. అందరి కంటే టాప్‌లో ఉన్నాడు. 2013 నుంచి 2021 వరకూ ఐపీఎల్ ఒకే ఒక్క డకౌట్ అయిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లో ఏకంగా మూడు సార్లు డకౌట్ కావడం విశేషం.