జోస్ బట్లర్ అలా ఆడుతుంటే, అశ్విన్‌ని పంపుతారా... రాజస్థాన్ రాయల్స్‌పై...
ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్లలో ఒకటి రాజస్థాన్ రాయల్స్. స్టార్ ప్లేయర్లను, టాప్ క్లాస్ బౌలర్లను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పటివరకూ 5 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఓడింది రాజస్థాన్ రాయల్స్...

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్‌ని బ్యాటింగ్‌కి పంపిన రాజస్థాన్ రాయల్స్... గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే రకమైన ఎత్తుగడ వేసింది...
రెండో ఓవర్‌లో ఆఖరి బంతికి స్ట్రైయిక్‌లోకి వచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు దేవ్‌దత్ పడిక్కల్. అప్పటికే జోస్ బట్లర్ వరుస బౌండరీలతో జోరు మీద ఉన్నాడు...
బట్లర్‌కి తోడుగా రవిచంద్రన్ అశ్విన్‌ని వన్‌డౌన్‌లో పంపడం హాట్ టాపిక్ అయ్యింది. బట్లర్‌కి స్ట్రైయిక్ ఇవ్వడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన అశ్విన్, 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
అశ్విన్ అవుటైన తర్వాత సంజూ శాంసన్ రనౌట్ కావడం, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, సిమ్రాన్ హెట్మయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో వరుస వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...
‘వన్‌డౌన్‌లో సంజూ శాంసన్ సరైన బ్యాటర్. యశస్వి జైస్వాల్ లాంటి హిట్టర్, టీమ్‌లో ఉన్నాడు. అయితే అతన్ని టీమ్ నుంచి తప్పించారు. శాంసన్ వన్‌డౌన్‌లో వచ్చి ఉంటే ఆర్ఆర్ పొజిషన్ బాగుంటుండే... అశ్విన్‌ని వన్‌డౌన్‌లో పంపడం చాలా పెద్ద తప్పిదం...
అశ్విన్‌ని ఫించ్ హిట్టర్‌గా పంపి ఉండొచ్చు. అయితే 215-220 పరుగుల టార్గెట్ ఉంటే ఇలాంటి మూమ్ చేసి ఉంటే బాగుండేది. బట్లర్ అలాంటి ప్రారంభం ఇచ్చినా, రాజస్థాన్ టార్గెట్ ఛేదించడంలో ఫెయిల్ అయ్యింది...
అశ్విన్‌ని వన్‌డౌన్‌లో పంపడం వల్ల ప్రత్యర్థి జట్టుకి ఛాన్స్ ఇచ్చినట్టైంది. ఎప్పుడు ప్రయోగాలు, ఎలాంటి ప్రయోగాలు చేయాలనే విషయంలో రాజస్థాన్ క్లారిటీ తెచ్చుకుంటే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్..