- Home
- Sports
- Cricket
- విరాట్ కంటే రోహిత్ శర్మ చాలా బెటర్... కోహ్లీ అయితే అసలు ఇష్టం లేనట్టు ఆడుతున్నాడు...
విరాట్ కంటే రోహిత్ శర్మ చాలా బెటర్... కోహ్లీ అయితే అసలు ఇష్టం లేనట్టు ఆడుతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత స్టార్లు, సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటు నుంచి ఇప్పటిదాకా ఒక్క బెస్ట్ పర్ఫామెన్స్ కూడా రాలేదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు, ఇలాంటి ఫామ్‌లో ఉండడం టీమిండియాని కలవరపెడుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడి 114 పరుగులు చేశాడు. యావరేజ్ 19 మాత్రమే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 41 పరుగులు చేశాడు రోహిత్...
9 సీజన్ల తర్వాత సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగుతున్న ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 7 మ్యాచుల్లో 119 పరుగులు చేశాడు. విరాట్ అత్యధిక స్కోరు 48 పరుగులు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు సార్లు రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...
‘రోహిత్ శర్మ భారీ స్కోరు చేయలేకపోయినా కొట్టిన 20 అయినా బాగా ఆడుతున్నాడు. అతని బ్యాటు నుంచి మంచి షాట్స్ వస్తున్నాయి. మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు...
అయితే విరాట్ కోహ్లీ మాత్రం అసలు ఏ మాత్రం ఇష్టం లేనట్టే ఆడుతున్నట్టుగా ఉంది. విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఫామ్‌లో లేడు, అతను ఆడే షాట్స్‌లోనూ ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
Virat Kohli
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. అతనికి విశ్రాంతి అవసరం. విరాట్ బ్రేక్ తీసుకుని, కమ్‌బ్యాక్ ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
‘విరాట్ కోహ్లీ, దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్ బూట్స్‌ని పక్కనబెట్టేస్తే బెటర్. సోషల్ మీడియాకి దూరంగా వెళ్లి, మళ్లీ కొత్తగా, రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...