- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో పోతేపోనీ! టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో రోహిత్ సేన ఇలా ఓడితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్‌లో పోతేపోనీ! టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో రోహిత్ సేన ఇలా ఓడితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. 9 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్, ఐపీఎల్ టైటిల్స్ కారణంగా టీమిండియా కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో రోహిత్ సేన ఘోరంగా విఫలమవుతోంది...

Rohit Sharma
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్... ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే మొట్టమొదటి జట్టుగా నిలిచే ప్రమాదంలో పడింది...
Jasprit Bumrah
ఐపీఎల్ 2019 సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ విధంగానే వరుస పరాజయాలు ఎదుర్కొంది. మొదటి ఆరు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని ఆఖరి స్థానంలో నిలిచింది...
అదే ఏడాది టైటిల్ ఫెవరెట్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడింది భారత జట్టు. గ్రూప్ స్టేజ్‌లో వరుస మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ఆడబోతోంది భారత జట్టు. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌లో అనుమానాలు రేగుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ... వరుసగా 15 మ్యాచుల్లో గెలిచి... క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్నాడు...
న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో, వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లో, శ్రీలంకను టీ20, టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన... ఇప్పటిదాకా హిట్ మ్యాన్ కెప్టెన్సీలో చెలరేగిపోయింది.
అయితే ఇప్పటిదాకా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన మ్యాచ్‌లన్నీ స్వదేశంలో జరిగినవి. పెద్దగా ఫామ్‌లో లేని చిన్న జట్లపై, ఉపఖండ పిచ్‌లపై పెద్దగా మంచి రికార్డు లేని న్యూజిలాండ్‌తో జరిగినవే...
విరాట్ కోహ్లీ అందించలేకపోయిన ఐసీసీ టైటిల్‌ని రోహిత్ శర్మ అందిస్తాడని హిట్ మ్యాన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే 2022 సీజన్ వాటిని తారుమారు చేసేసింది...
ఐపీఎల్ 2021 సీజన్‌లో లేదా అంతకుముందు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఈ విధంగా ఓడి ఉంటే... రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు దక్కి ఉండేవి కావని అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
ఫ్రాంఛైజీ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ రెండూ ఒక్కటి కాదు... ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించారు టీమిండియా ఫ్యాన్స్... వరుస పరాజయాలు వచ్చిన తర్వాత రోహిత్ ఫ్రస్టేషన్ చూస్తుంటే, అప్పుడు విరాట్ కోహ్లీయే చాలా బెటర్ అంటున్నారు మరికొందరు.