- Home
- Sports
- Cricket
- ముఖానికి షీల్డ్‌తో బౌలింగ్ చేసిన రిషి ధావన్... ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతూ, ఎందుకీ షీల్డ్...
ముఖానికి షీల్డ్‌తో బౌలింగ్ చేసిన రిషి ధావన్... ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతూ, ఎందుకీ షీల్డ్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రిషి ధావన్, ముఖానికి ఓ ప్రొటెక్షన్ షీల్డ్‌తో బౌలింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిషి ధావన్ షీల్డ్ పెట్టుకుని ఎందుకు బౌలింగ్ చేశాడు? దానికి వెనక ఓ పెద్ద కారణమే ఉంది...

దేశవాళీ టోర్నీల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే రిషి ధావన్, రంజీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో గాయపడ్డాడు. రిషి బౌలింగ్‌లో ఓ బ్యాటర్ కొట్టిన స్ట్రైయిక్ డ్రైవ్, నేరుగా వచ్చి బౌలర్ ముఖానికి తగిలింది...
మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతి బలంగా తాకడంతో రిషి ధావన్ ముక్కు చిట్లింది. ఆ గాయానికి శస్త్ర చికిత్స పూర్తి కాగానే ఐపీఎల్ ఆరంభమైంది...
ముక్కుకి అయిన గాయం తగ్గకపోవడంతో చేతులు తగిలినా, దుమ్ము దూళి పోయినా ఇన్‌ఫెక్షన్ అవుతుందనే ఉద్దేశంతో సేఫ్టీ షీల్డ్‌తో బౌలింగ్ చేశాడు రిషి ధావన్..
ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న రిషి ధావన్, శివమ్ దూబేని క్లీన్ బౌల్డ్ చేసి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రిషి ధావన్‌ని మాత్రం సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో అదరగొట్టిన రిషి ధావన్, విజయ్ హాజారే ట్రోఫీ గెలిచి హిమాచల్ ప్రదేశ్ జట్టుకి కెప్టెన్‌గా మొట్టమొదటి దేశవాళీ టోర్నీ అందించాడు...
పటిష్టమైన తమిళనాడు జట్టును హిమాచల్ ప్రదేశ్ ఫైనల్‌లో ఓడిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే రిషి ధావన్ కెప్టెన్సీతో బౌలింగ్‌లో 3 వికెట్లు, బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
1990 ఫిబ్రవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఏరియాలో జన్మించిన రిషి ధావన్, దేశవాళీ టోర్నీల్లో పర్పామెన్స్ కారణంగా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసి ఇప్పటికే మూడు వన్డే మ్యాచులు, ఓ టీ20 కూడా ఆడాడు...
2008 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ధావన్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2013లో రిషి ధావన్, ముంబై ఇండియన్స్ తరుపున కూడా ఆడాడు...
2014 ఐపీఎల్ వేలంలో రిషి ధావన్‌ను ఏకంగా రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 2017 వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.55 లక్షలకు సొంతం చేసుకుంది...
అయితే ఐపీఎల్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రిషీ ధావన్, ఈ ఏడాది దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా అదరగొడుతున్నాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆల్‌రౌండ్ పర్పామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు ధావన్...
విజయ్ హాజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లో 69.33 సగటుతో 416 పరుగులు చేశాడు రిషీ ధావన్. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు ధావన్...
అంతకుముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో 117 పరుగులు చేసి, 14 వికెట్లు తీసిన రిషి ధావన్, ఆ పర్ఫామెన్స్ కారణంగా ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు...