ఒట్టేసి చెబుతున్నా, ఈసారి కప్పు గెలిచేది వాళ్లే... హర్భజన్ సింగ్ జోస్యం...
ఫ్యాన్స్‌యందు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ వేరయా... ఎందుకంటే 15 ఏళ్లుగా టైటిల్ గెలవలేకపోయినా ప్రతీ సీజన్‌లో ఆర్‌సీబీకి సపోర్ట్ చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే యేటికేటికీ ఆర్‌సీబీ క్రేజ్ పెరుగుతూ పోతోంది...

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ స్టేజీని టాప్ 4గా ముగించి, నెగిటివ్ రన్ రేట్‌తో ప్లేఆఫ్స్‌కి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది...
Image credit: PTI
లక్నోపై 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని, 2016 తర్వాత టైటిల్ రేసులో టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆశలు మళ్లీ చిగురించాయి...
Image credit: PTI
ఎన్ని సార్లు తమ ఆశలపై ఆర్‌సీబీ నీళ్లు చల్లినా... ఈసారి కప్ నమ్‌దే అంటూ మళ్లీ మళ్లీ టీమ్‌కి సపోర్ట్ చేసే ఫ్యాన్స్... ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలవకుండా ఏ టీమ్ ఆపలేదని ధీమాగా చెబుతున్నారు...
తాజాగా ఈ లిస్టులో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరిపోయాడు. ‘ఈసారి ఆర్‌సీబీ టీమ్‌లో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ మాత్రమే కాదు బౌలింగ్ లైనప్ కూడా చక్కగా ఉంది...
Image credit: PTI
మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా కనిపిస్తున్నారు.ఒట్టేసి చెబుతున్నా... ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుంది. టైటిల్ గెలవడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆర్‌సీబీకి ఉన్నాయి...
ఆర్‌సీబీ టైటిల్ గెలవడానికి కావాల్సింది రెండే విషయాలు. ఒకటి మేం చేయగలమనే నమ్మకం, విశ్వాసం... రెండోది సమిష్టిగా పోరాడడం. వాళ్లంతా కలిసి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలరు...
విజయం కోసం ప్రతీ ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తే, ఎలాంటి మ్యాచ్‌నైనా గెలవగల సత్తా ఆర్‌సీబీకి ఉంది... వాళ్లు నెగిటివ్ రన్ రేట్‌తో ప్లేఆఫ్స్‌కి వచ్చారని మరిచిపోకూడదు...
కింద నుంచి పైకి వచ్చేవారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు.. మిగిలిన రెండు జట్లు, ఆర్‌సీబీని ఓడించాలంటే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...