- Home
- Sports
- Cricket
- ముంబై ఇండియన్స్‌కి ఆర్‌సీబీ ఫ్యాన్స్ సపోర్ట్... అప్పుడు తిట్టి, ఇప్పుడు ఎలాగైనా గెలవాలంటూ...
ముంబై ఇండియన్స్‌కి ఆర్‌సీబీ ఫ్యాన్స్ సపోర్ట్... అప్పుడు తిట్టి, ఇప్పుడు ఎలాగైనా గెలవాలంటూ...
ఐపీఎల్ వల్ల క్రికెట్ ఫ్యాన్స్‌లోనూ చీలికలు వచ్చాయి. సీఎస్‌కేని సపోర్ట్ చేసేవాళ్లకి ముంబై ఇండియన్స్ నచ్చదు, ముంబైని సపోర్ట్ చేసేవాళ్లకి ఆర్‌సీబీ ఫ్యాన్స్ నచ్చరు. అయితే ఇప్పుడు ఆర్‌సీబీ ఫ్యాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌ని ఎన్నడూలేనంతగా సపోర్ట్ లభిస్తోంది...

ఐపీఎల్‌లో 15 సీజన్లుగా టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్‌లో ఉంటుంది. క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ వంటి దిగ్గజాలందరూ ఒకే టీమ్‌లో ఉన్నా... ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయారు...
Image credit: PTI
ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుసగా 6 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది...
ఈసారి ఆర్‌సీబీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, ముంబై ఇండియన్స్‌పైనే ఆశలన్నీ పెట్టుకుంది.
14 మ్యాచుల్లో 8 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులకి ఆలౌట్ అయ్యి, చిత్తుగా ఓడింది. ఈ పరాజయం ఎఫెక్ట్‌తో ఆర్‌సీబీ రన్‌రేట్ - 0.253 గా ఉంది...
13 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, ఆఖరి మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేటు +0.253గా ఉంది.. దీంతో ఆఖరి మ్యాచ్‌లో స్వల్ప తేడాతో గెలిచినా ఆర్‌సీబీ కంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి...
దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను, ముంబై ఇండియన్స్ ఎలాగైనా ఓడించాల్సి ఉంటుంది. 13 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న ముంబై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ముంబై ఉన్న ఫామ్‌తో పోలిస్తే, ఢిల్లీపై గెలవడం అంత తేలికైన విషయమేమీ కాదు...
దీంతో ముంబై ఇండియన్స్ విజయాన్ని కాంక్షిస్తే, ఆర్‌సీబీ ఫ్యాన్స్ ట్వీట్లు, పోస్టులతో తెగ సపోర్ట్ చేస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి ముంబై ఇండియన్స్ సీజన్‌ని ఘనంగా ముగించాలని కోరుకుంటున్నారు...
ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అంటే అంపైర్లతో ఫిక్సింగ్ చేసుకునే టీమ్ అని, ఆ జట్టునీ, కెప్టెన్ రోహిత్ శర్మని తిడుతూ పోస్టులు పెట్టినవాళ్లే, ఇప్పుడు ఎలాగైనా ముంబై గెలవాలంటూ ప్రార్థిస్తున్నారు...
ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ కూడా ముంబై ఇండియన్స్ గెలవాలని, ముంబైకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుందంటూ కామెంట్లు చేయడం విశేషం...
ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడంతో సీజన్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి ముంబై ఇండియన్స్‌ని గెలిపించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్...