- Home
- Sports
- Cricket
- కప్ గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ... విరాట్ కోహ్లీకి కొత్త కష్టాలు తెచ్చిన ఆర్‌సీబీ...
కప్ గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ... విరాట్ కోహ్లీకి కొత్త కష్టాలు తెచ్చిన ఆర్‌సీబీ...
ఐపీఎల్ చరిత్రలో 15 సీజన్లుగా ఒకే ఫ్రాంఛైజీ తరుపున ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఎంట్రీ ఇచ్చిన విరాట్, 15 సీజన్లుగా అదే టీమ్ తరుపున ఆడుతున్నాడు. 9 సీజన్లలో కెప్టెన్‌గానూ చేశాడు...

Virat Kohli
ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే తనకి ఆఖరి సీజన్ అంటూ ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగుతున్నాడు...
Image credit: PTI
ఈ సీజన్‌లో రెండు సార్లు రనౌట్, రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఎలాగోలా 300+ పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఫీట్ సాధించడం 13వ సారి...
Image credit: PTI
ఐపీఎల్‌లో 12 సీజన్లలో 300+ పరుగులు చేసిన సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను అధిగమించి, టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా గెలిచాడు...
Image credit: PTI
ఐపీఎల్‌లో 14వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మ 18 సార్లు, ఎమ్మెస్ ధోనీ 17 సార్లు, యూసఫ్ పఠాన్ 16 సార్లు, సురేష్ రైనా 14 సార్లు తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా టాప్ 5లో నిలిచాడు...
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఆర్‌సీబీ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 8 మ్యాచుల్లో విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, వరుసగా మూడో సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరినా నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది ఆర్‌సీబీ...
ఈసారి ప్లేఆఫ్స్ చేరితే పెద్దగా అనుభవం లేని సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది ఆర్‌సీబీ...
సౌతాఫ్రికా కెప్టెన్‌గా అంతర్జాతీయ జట్టుకే కెప్టెన్‌గా చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఈ కుర్రాళ్లను ఓడించి టైటిల్ సాధిస్తే... ఆర్‌సీబీ ఫ్యాన్స్ 15 సీజన్లుగా కంటున్న కల తీరినట్టే అవుతుంది. అయితే ఇది విరాట్‌పై విమర్శలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా వరుసగా విఫలమవుతూ వస్తున్నా 9 సీజన్ల పాటు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, 2016 సీజన్‌లో ఫైనల్ చేర్చడం తప్ప టైటిల్ అందించలేకపోయాడు. విరాట్ కెప్టెన్సీ తప్పుకోగానే ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే, ఆ జట్టు టైటిల్ గెలవకుండా ఇన్నాళ్లు అడ్డుకున్నది కోహ్లీయేనని ట్రోల్స్ వస్తాయి...
ముందే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుని ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పుడో టైటిల్ గెలిచేదని గేలి చేసేవాళ్లు లక్షల్లో ఉంటారు.దీంతో ఆర్‌సీబీ ఈసారి కప్ గెలిస్తే ఓ బాధ, గెలవపోతే ఓ బాధ అన్నట్టు తయారైంది విరాట్ పరిస్థితి...