పాపం జడ్డూ! అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి... ఎమ్మెస్ ధోనీ కారణంగా...
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకి కీలక ప్లేయర్‌గా మారిన జడ్డూ... రెండేళ్లుగా సీఎస్‌కే కెప్టెన్సీని ఆశిస్తున్నాడు...

సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు ‘8’ అంటూ తనని తాను సీఎస్‌కే భావి సారథిగా ప్రమోట్ చేసుకున్నాడు రవీంద్ర జడేజా...
ఐపీఎల్ 2021 సీజన్‌లో అటు బాల్‌తో, ఇటు బ్యాటుతో... మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఆల్‌రౌండ్ షో చేసిన రవీంద్ర జడేజా... సీఎస్‌కే టైటిల్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు...
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు మాహీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఊహించినట్టే సారథ్య పగ్గాలు రవీంద్ర జడేజాకి వచ్చాయి...
అయితే లేటు వయసులో కెప్టెన్‌గా తనకి దక్కిన ఈ అవకాశాన్ని వాడుకుని, లెజెండరీ క్రికెటర్ల లిస్టులో చేరిపోవాలని ఆశపడ్డాడు రవీంద్ర జడేజా...
అయితే ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభమయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ చేతుల్లో సీఎస్‌కే పరాజయం పాలైంది. కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లో ఓడిన మొట్టమొదటి సీఎస్‌కే సారథి జడేజా...
ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా కెప్టెన్లుగా తమ మొదటి మ్యాచ్‌లో విజయాలను అందుకున్నారు. రెండో మ్యాచ్‌లో 210 పరుగుల భారీ స్కోరు చేసినా జడ్డూకి కెప్టెన్‌గా విజయం దక్కలేదు...
211 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఈజీగా ఊదేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే మొదటి రెండు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి...
వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, టాప్ క్లాస్ బ్యాటర్లు, అద్భుతమైన ఫీల్డర్లతో నిండిన చెన్నై సూపర్ కింగ్స్‌ని నడిపించాలని ఆశపడిన జడ్డూ... పేలవ ఫీల్డింగ్, పసలేని బౌలింగ్‌తో కూడిన జట్టు దక్కింది.
పోనీ కెప్టెన్సీ అయినా చేద్దామంటే ఎమ్మెస్ ధోనీ, అన్నీ తానై చూసుకుంటే ఆన్ ఫీల్డ్ కెప్టెన్‌గా మారిపోయాడు. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మాహీకి ఎదురుచెప్పలేని పరిస్థితి జడ్డూ...
ఆఖరికి 19వ ఓవర్‌లో శివమ్ దూబేకి బౌలింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌ను ముఖేష్ చౌదరితో వేయించింది కూడా ఎమ్మెస్ ధోనీయే. ఇందులో జడ్డూ కూడా ప్రేక్షక పాత్రే పోషించాడు...
అదీకాక కెప్టెన్సీ ప్రెషర్‌తో బాధ్యతగా ఆడాలనే ఉద్దేశంతో తన సహజసిద్ధమైన బ్యాటింగ్ స్టైల్‌లో దూకుడు చూపించలేకపోతున్నాడు రవీంద్ర జడేజా...
ఐపీఎల్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సరిగా విజయాలు అందుకోకపోతే ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీని కూడా వీరలెవల్లో ట్రోల్ చేస్తారు సీఎస్‌కే ఫ్యాన్స్..
అలాంటిది రవీంద్ర జడేజా మరో రెండు మ్యాచుల్లో సీఎస్‌కే విజయాలు అందివ్వలేకపోతే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదు...
Image Credit: Getty Images
ఓవరాల్‌గా కెప్టెన్‌గా రవీంద్ర జడేజాకి ఆశించిన ఆరంభం అయితే దక్కలేదు. ఆన్ పేపర్ కెప్టెన్‌గా మారిన జడ్డూ, మొదటి విజయం ఎప్పుడు అందుకుంటాడో చూడాలి...