అలాంటి ప్లేయర్‌ని ఎలా పక్కనబెట్టారు... చెన్నై గతికి అదే కారణమన్న రవిశాస్త్రి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్, 10 మ్యాచుల్లో ఓడి నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. కాస్త నెట్ రన్ రేట్ బాగుండి 9లో ఉంది కానీ లేకుండా 10వ స్థానంలోకి పడిపోయి చిట్టచివరన ముగించేదే...

Image credit: PTI
2020 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరకపోయినా ఆఖర్లో హ్యాట్రిక్ విజయాలు అందుకుని, ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి అలాంటి పర్పామెన్స్ కూడా ఇవ్వలేకపోయింది...
Image credit: PTI
ఫస్టాఫ్‌లో ఏ మాత్రం పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్, సెకండాఫ్‌లో ఫామ్ అందుకున్నా... 400+ పరుగులు కూడా చేయలేకపోయాడు. ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేని కొన్ని మ్యాచుల్లో పక్కనబెట్టి భారీ మూల్యమే చెల్లించుకుంది సీఎస్‌కే...
‘సురేష్ రైనా లాంటి మ్యాచ్ విన్నర్‌ని పక్కనబెట్టడమే చెన్నై సూపర్ కింగ్స్ చేసిన చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే అతను టీమ్ ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో రైనాకి బాగా తెలుసు...
టాప్ 3లో ఆడగలడు, కావాలంటే ఫినిషర్‌గా మారి మ్యాచ్‌ని ముగించగలడు. నిలకడగా పరుగులు చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించగలడు...
Image credit: PTI
సురేష్ రైనా అవతలి ఎండ్‌లో ఉంటే ఇతర బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడగలరు. ఎదుటి బ్యాటర్ ప్రెషర్‌ను తీసుకుని బ్యాటింగ్ చేసే రైనాలాంటి ప్లేయర్ దొరకడం చాలా కష్టం. అతన్ని పక్కనబెట్టిన సీఎస్‌కే, ఇప్పుడు అలాంటి ప్లేయర్‌ని వెతకాల్సిన అవసరం ఉంది...
ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సీనియర్ టీమ్‌ని నడిపించడం చాలా కష్టం. సీఎస్‌కే అందరు ప్లేయర్లు సెట్ కాలేరు. వారికి ఓ రిథమ్ సెట్ అవ్వాలి, దానికి టైమ్ పడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. సీఎస్‌కే పర్సులో రూ.2 కోట్లకు పైగా డబ్బు మిగిలే ఉన్నా, రైనాని బేస్ ప్రైజ్‌కి కొనడానికి ఆసక్తి చూపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...