మావోడు చూడడానికే సైలెంట్... సంజూ శాంసన్ భార్య చారులత చెప్పే క్యూట్ లవ్‌స్టోరీ...
కెప్టెన్ అంటే ఫీల్డర్లపై కోపం చూపించాలి,ప్రత్యర్థి టీమ్‌ని సెడ్జింగ్ చేసి విసిగించాలి.. వికెట్ కీపర్ కూడా అయితే బౌలర్లకు సలహాలు ఇస్తూ, వికెట్ల వెనక నుంచి అరుస్తూ ఉండాలి, అయితే ఇవేమీ చేయకుండానే సైలెంట్‌గా టీమ్‌ని ఫైనల్‌కి తెచ్చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...

టీమిండియాలోనే అత్యంత సైలెంట్ అండ్ రిజర్డ్వు ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంజూ శాంసన్, వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత సైలెంట్ కాదట. ముఖ్యంగా సంజూ శాంసన్ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది...
సంజూ శాంసన్, కేరళలోని తిరువనంతపురంలో మార్ ఇవనోయిస్ కాలేజీలో బీఏ చదివాడు. ఇదే కాలేజీలో కెమిస్ట్రీలో బీఎస్సీ చదవింది ఆయన సతీమణి చారులత...
క్రికెట్ ప్రాక్టీస్‌లో బిజీబిజీగా ఉండే సంజూ శాంసన్, అప్పుడప్పుడూ కాలేజీకి వెళ్లేవాడు. అలా తన కాలేజీలో చారులతను చూసిన సంజూ, ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు...
చారులత, సంజూ శాంసన్ పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అలా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది...
సంజూ శాంసన్ చిన్న వయసులోనే క్రికెటర్‌గా భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో చారులత ఇంట్లో ఆమె ప్రేమకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. క్రికెట్ లేని రోజుల్లో ఈ ఇద్దరు ప్రేమపక్షులు చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్లు...
ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత ఎట్టకేలకు 2018, డిసెంబర్ 22న వీరి వివాహం జరిగింది. చారులత హిందు మతానికి చెందినది కాగా, సంజూ శాంసన్ క్రిస్టియన్. ఈ ఇద్దరి వివాహం రెండు మతాల సంప్రదాయాల్లో జరిగింది...
సైలెంట్‌గా కనిపించే సంజూ శాంసన్ గురించి అప్పుడప్పుడూ కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టులు చేస్తూ ఉంటుంది చారులత. రాజస్థాన్ రాయల్స్, రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీని ఓడించిన తర్వాత చారులత చేసిన పోస్టు హాట్ టాపిక్ అయ్యింది...
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభంలోనే ఫైనల్ రేసులో ఉండేవాళ్లని ఉద్దేశించి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఓ ప్రోమోని తయారుచేసింది. ఇందులో సంజూ శాంసన్ లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ చారులత చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది..
‘ఐపీఎల్ 2022 సీజన్ మొదటి రోజే ఈ యానిమేటెడ్ వీడియో చూశాను. అయితే ఇందులో పింక్ జెర్సీ ప్లేయర్లు ఎందుకు లేరో ఇప్పటికీ అర్థం కావడం లేదు...’ అంటూ రాసుకొచ్చింది చారులత సంజూ శాంసన్...
ఐపీఎల్‌లో 400+ పరుగులు చేసినప్పటికీ సంజూ శాంసన్‌కి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ విషయంపై సంజూ సైలెంట్‌గా ఉన్నా చారు ఎలా స్పందింస్తుందో చూడాలని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్...