MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆర్‌సీబీకి పంజాబ్ కింగ్స్ గండం... ఆ గీత దాటితే లక్నోని కిందకి నెట్టి, టాప్ 2లోకి బెంగళూరు...

ఆర్‌సీబీకి పంజాబ్ కింగ్స్ గండం... ఆ గీత దాటితే లక్నోని కిందకి నెట్టి, టాప్ 2లోకి బెంగళూరు...

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఐపీఎల్ 2022 సీజన్ మొదటి మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీపై ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్, ఈసారి ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను నిర్ణయించనుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 13 2022, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫాఫ్ డుప్లిసిస్ 88 పరుగులు చేయగా అనుజ్ రావత్ 21 పరుగులు, విరాట్ కోహ్లీ 41, దినేశ్ కార్తీక్ 32 పరుగులు చేసి రాణించారు...

29

అయితే పంజాబ్ కింగ్స్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఊదేసింది. మయాంక్ అగర్వాల్ 32, శిఖర్ ధావన్ 43, భనుక రాజపక్ష 43, లియామ్ లివింగ్‌స్టోన్ 19 పరుగులు చేయగా షారుక్ ఖాన్ 24, ఓడియన్ స్మిత్ 25 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు...

39

పరాజయంతో సీజన్‌ను ప్రారంభించిన 12 మ్యాచులు ముగిసేసమయానికి 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచుల్లో 5 విజయాలతో 8వ స్థానంలో ఉంది...

49

నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్‌కి కీలకం కాగా, ఆర్‌సీబీ టాప్ 2లో నిలిచే అవకాశాలను నిర్ణయించనుంది. నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 125 పరుగుల తేడాతో గెలిస్తే... ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌ నెట్ రన్ రేట్‌ను అధగమించి టాప్ 2లోకి ఎంట్రీ ఇస్తుంది...

59

ఛేదనలో అయితే లక్నో సూపర్ జెయింట్స్ విధించిన లక్ష్యాన్ని 5-6 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఈ రెండు కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు... ఆర్‌సీబీ నేటి మ్యాచ్‌లో ఓడితే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడిపోతుంది...
 

69

అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్‌కి కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఆర్‌సీబీ నేటి మ్యాచ్‌లో గెలవడమమే కాదు, భారీ తేడాతో ఘన విజయం అందుకోవాల్సి ఉంటుంది...
 

79

పంజాబ్ కింగ్స్‌ నేటి మ్యాచ్‌లో గెలిచి, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుని, టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి...

89

ఆర్‌సీబీపై పంజాబ్ కింగ్స్‌కి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య 29 మ్యాచులు జరగగా పంజాబ్ కింగ్స్ 16 మ్యాచుల్లో, ఆర్‌సీబీ 13 మ్యాచుల్లో గెలిచాయి...

99

2020 నుంచి ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచులు జరగగా పంజాబ్ కింగ్స్ నాలుగింట్లో విజయాలు అందుకుంది. ఆర్‌సీబీ ఒకే ఒక్క మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించగలిగింది..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Recommended image2
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image3
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved