- Home
- Sports
- Cricket
- దీపక్ చాహార్ కాదు, సీఎస్‌కే ఈ సీజన్‌లో మిస్ చేసుకుంది అతన్నే... సురేశ్ రైనా లేక ఒక్కరూ కొట్టలేక...
దీపక్ చాహార్ కాదు, సీఎస్‌కే ఈ సీజన్‌లో మిస్ చేసుకుంది అతన్నే... సురేశ్ రైనా లేక ఒక్కరూ కొట్టలేక...
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న చెన్నై ప్లేయర్లు ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. మ్యాచులు ముగియడంతో బయో బబుల్‌ను వీడి, హాలీడేస్ ప్లాన్స్ వేస్తున్నారు...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం నుంచి ప్రధాన పేసర్ దీపక్ చాహార్ లేకనే చెన్నై సూపర్ కింగ్స్ సరైన విజయాలు సాధించలేకపోతుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. గణాంకాలు మాత్రం వేరేలా చెబుతున్నాయి....
ఐపీఎల్ 2021 సీజన్‌లో దీపక్ చాహార్ 14 వికెట్లు మాత్రమే తీయగా అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యంగ్ బౌలర్ ముకేశ్ చౌదరి ఈ సీజన్‌లో 16 వికెట్లు తీశాడు. అంటే చాహార్ కంటే 2 వికెట్లు ఎక్కువే తీశాడు. అయితే దీపక్ చాహార్ కంటే ఎక్కువగా సరైన బ్యాటర్ లేక తెగ ఇబ్బందిపడింది చెన్నై...
ప్రతీ సీజన్‌లోనూ సీఎస్‌కే తరుపున ఎవరో ఒక బ్యాటర్ 400+ పరుగులు చేస్తూ వచ్చారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్ చేసిన 368 పరుగులే సీఎస్‌కే తరుపున అత్యధికం...
2008 ఆరంగ్రేటం సీజన్‌లో సురేశ్ రైనా, ఎమ్మెస్ ధోనీ ఇద్దరూ సీఎస్‌కే తరుపున 400+ పరుగులు చేశారు. 2009లో ఎమ్మెస్ ధోనీ ఈ ఫిగర్ మిస్ అయినా రైనాతో పాటు మాథ్యూ హేడెన్ ఈ ఫీట్ సాధించారు...
2010లో రైనాకి తోడుగా మురళీ విజయ్ 400+ పరుగులు చేసిన చెన్నై బ్యాటర్‌గా నిలవగా, 2011 సీజన్‌లో రైనా, విజయ్‌తో పాటు మైక్ హుస్సీ కూడా ఈ ఫీట్ సాధించాడు...
2012 సీజన్‌లో సురేశ్ రైనా ఒక్కడే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 400+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలవగా 2013 సీజన్‌లో రైనా, ధోనీ, హుస్సీ ఈ ఫీట్ సాధించారు...
Dwayne Smith
2014 సీజన్‌లో రైనాతో పాటు డ్వేన్ స్మిత్, మెక్‌కల్లమ్ 400+ పరుగులు చేయగా, 2015 సీజన్‌లో రైనా ఈ ఫీట్ సాధించలేకపోయాడు. రైనాకి బదులుగా బ్రెండన్ మెక్‌కల్లమ్, సీఎస్‌కే తరుపున 400+ పరుగులు చేశాడు..
Image Credit: Getty Images
2018 రీఎంట్రీ సీజన్‌లో సురేశ్ రైనా, ఎమ్మెస్ ధోనీ, షేన్ వాట్సన్, అంబటి రాయుడు అదరగొట్టి 400+ పరుగులు చేశారు... 2019 సీజన్‌లో మాత్రమ ఒక్క మాహీ మాత్రం ఈ ఫీట్ సాధించాడు...
2020 సీజన్‌లో చెన్నై వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నా ఫాఫ్ డుప్లిసిస్ 400+ పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఆడలేదు...
Ruturaj Gaikwad ,Faf du Plessis
గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్ ఇద్దరూ 400+ కాదు, ఏకంగా 620+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 2 పొజిషన్స్‌లో నిలిచారు...
Image credit: PTI
మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 8 సీజన్లలో 400+ పరుగులు సాధించాడు సురేశ్ రైనా. ఎమ్మెస్ ధోనీ నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఈ సారి చెన్నై బాగా మిస్ చేసుకుంది అలాంటి బ్యాటర్‌నే...