- Home
- Sports
- Cricket
- ముంబై ఇండియన్స్ అతన్ని తీసుకుంటుందని అనుకోలేదు, ఆ గొడవ తర్వాత... హర్భజన్ సింగ్ కామెంట్స్...
ముంబై ఇండియన్స్ అతన్ని తీసుకుంటుందని అనుకోలేదు, ఆ గొడవ తర్వాత... హర్భజన్ సింగ్ కామెంట్స్...
భారత క్రికెట్‌లో మంకీ గేట్ వివాదం రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని ‘మంకీ’ అని పిలవడం, ఆ పిలుపు అక్కడ జాతివివక్షకు సంబంధించిన తిట్టు కావడంతో తీవ్ర దుమారమే రేగింది...

భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మధ్య కొన్ని రోజుల పాటు ఈ వివాదం గురించి విచారణ జరిగింది. చివరికి బీసీసీఐ, ఆసీస్‌పై పైచేయి సాధించింది...
హర్భజన్ సింగ్, సైమండ్స్‌కి ‘మంకీ’ అనలేదని... ‘మా... కీ’ అన్నాడని నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ సాక్ష్యం చెప్పడం కూడా పెద్ద వివాదానికి దారి తీసింది...
2008లో సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీ గేట్’ సంఘటన తర్వాత మూడేళ్లకు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు హర్భజన్ సింగ్...
‘ఐపీఎల్ 2011 వేలంలో ముంబై ఇండియన్స్, ఆండ్రూ సైమండ్స్‌ని కొనుగోలు చేసింది. ఆ విషయం తెలియగానే నేను షాక్ అయ్యా, అతన్ని ఎందుకు కొనుగోలు చేశారు?
నేను, సైమండ్స్ కలిసి ఎలా ఆడగలం? అనుకున్నా. అయితే ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే నా ఆలోచనలన్నీ మారిపోయాయి...
అతను చాలా కోపంగా ఉంటాడని అనుకున్నా కానీ చాలా కూల్‌గా వచ్చి, నాతో చేతులు కలిపాడు. ఆ రోజు మేం కలిసి భోజనం చేశాం, రోజంతా కలిసే ఉన్నాం. ఆ రోజుతో మా మధ్య ఉన్న గొడవలన్నీ మటుమాయం అయిపోయాయి...
మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేనట్టు, ఏమీ జరగనట్టు అనిపించింది. ఛండీఘర్‌లో మ్యాచ్ ఆడి, గెలిచిన తర్వాత సైమండ్స్ నన్ను కౌగిలించుకున్నాడు.. మేం ఇద్దరం కలిసి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాం...
అక్కడ మేం ఒకరికొకరం క్షమాపణలు చెప్పుకు్నాం. అక్కడితో ఆ గొడవ మాయమైపోయింది. చాలామంది ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేయర్లు ఈ సంఘటనను తమ ఫోన్లలో బంధించారు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్..
ముంబై ఇండియన్స్‌కి కొన్ని మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన హర్భజన్ సింగ్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లకి ఆడిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా తరుపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన ఆండ్రూ సైమండ్స్, ఐపీఎల్2లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకి ప్రాతినిధ్యం వహించాడు.