ఆ రనౌట్ మా కొంపముంచింది, ఆఖరి మ్యాచ్‌లో అయినా... ముంబై సారథి రోహిత్ శర్మ...
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెరీర్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 2022 సీజన్‌లో ఇప్పటికే 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, అత్యంత చెత్త రికార్డు మూటకట్టుకుంది...

ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఎప్పుడూ టాప్ 7 కంటే కింది స్థానాల్లో సీజన్‌ని ముగించలేదు ముంబై ఇండియన్స్. 2009 సీజన్‌లో ఏడో స్థానంలో నిలవడమే ముంబై చెత్త రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు రోహిత్ శర్మ...
ఇప్పటికి 3 విజయాలు మాత్రమే అందుకున్న ముంబై ఇండియన్స్, ఆఖరి మ్యాచ్‌లో ఓడినా 4 గెలుపులతో 10 లేదా 9వ స్థానాల్లోనే పరిమితమవుతుంది. ఆఖరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయి, ఢిల్లీపై ముంబై ఘన విజయం అందుకుంటే టాప్ 9లోకి వచ్చే అవకాశం ఉంటుంది....
ఐపీఎల్ 2022 సీజన్‌లో 13 మ్యాచుల్లోనూ ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు రోహిత్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చేసిన 48 పరుగులే, రోహిత్‌కి ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు...
Rohit Sharma
ఆఖరి ఓవర్ వరకూ జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంటే... వరుసగా మొదటి 8 మ్యాచుల్లో ఓడిన తర్వాత తొలి విజయాన్ని అందుకున్న ముంబై, ఆఖరి 5 మ్యాచుల్లో రెండింట్లో ఓడింది...
‘19వ ఓవర్ వరకూ మేం గెలుస్తామనే అనుకున్నాం. అయితే టిమ్ డేవిడ్ రనౌట్, మా విజయావకాశాలను దెబ్బ తీసింది. అతను అవుట్ కాకముందే, ఈజీగా కొట్టేస్తామనే అనుకున్నాం...
Image Credit: PTI
ఆఖరి 2 ఓవర్లలో 19 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్, మాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆఖరి ఓవర్‌లో పరుగులు చేయడం కష్టమైపోయింది...
ఇక మాకు మిగిలింది ఆఖరి మ్యాచ్ ఒక్కడే. ఆ మ్యాచ్‌లో మా ఫార్ములా ఒక్కటే కొట్టేదేదో గట్టిగా కొట్టి పోతాం. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి, విజయంతో సీజన్‌ని ముగించడానికి ప్రయత్నిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...
ముంబై ఇండియన్స్ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాల్సి ఉండగా టి నటరాజన్ వేసిన 18వ ఓవర్‌లో 4 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు టిమ్ డేవిడ్. 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, 18వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు...
19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ వికెట్ మెయిడిన్‌తో ఆఖరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆ ఓవర్‌లో రమన్‌దీప్ సింగ్ ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టినా 3 పరుగుల తేడాతో ఓడింది ముంబై ఇండియన్స్...