పంత్, నువ్విలా చేస్తావనుకోలేదు, ఇది కరెక్ట్ కాదు! - మహ్మద్ అజారుద్దీన్...
చప్పగా పెద్దగా పస లేకుండా సాగిన ఐపీఎల్ 2022 సీజన్, ఇప్పుడిప్పుడే వేడి రాజుకుంటోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగి, ఫ్యాన్స్‌కి ఫుల్లు ఖుషీని అందించగా... ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో హై డ్రామా నడిచింది...

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు చేసి... సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు...
Rishabh Pant
223 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా లలిత్ యాదవ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు...
ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 36 పరుగులు కావాల్సి రాగా, రోవ్‌మెన్ పావెల్ మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్ బంతి... నేరుగా పావెల్ బ్యాటుకి తగిలింది. దీనికి నో బాల్ ఇవ్వకపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
డగౌట్‌లో ఉన్న ఢిల్లీ ప్లేయర్లు అంపైర్లపై అసహనం వ్యక్తం చేయడం, కొందరు క్రీజులోకి వచ్చి మరీ వాగ్వాదం చేయడంతో హై డ్రామా నడిచింది...
డగౌట్ దగ్గరున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో మ్యాచ్ ఆపేసి రావాల్సిందిగా రోవ్‌మెన్ పావెల్‌కి సూచించాడు కూడా... అయితే పావెల్ మాత్రం ఆ పని చేయలేదు...
‘ఆ బాల్‌కి నో బాల్ ఇచ్చి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదని అనుకున్నాం. నో బాల్ ఇవ్వకపోవడంతో కాస్త డిస్సపాయింట్ అయ్యాం. కానీ ఇలాంటివి అప్పుడప్పుడూ సహజం...
అది కచ్ఛితంగా నో బాల్ ఇవ్వాల్సిన డెలివరీ. డగౌట్‌లో అందరూ దీన్ని చూశారు. అందుకే కాస్త ఫ్రస్టేషన్‌కి లోనయ్యారు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్...
‘ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చేసిన పని నాకేం నచ్చలేదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. జెంటిల్మెన్ క్రికెట్‌లో ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు... ఇలాంటివి రిపీట్ కావని, కాకూడదని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ మహ్మద్ అజారుద్దీన్...
2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలోనూ ఇలాగే అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజులోకి వచ్చేశాడు అప్పటి సీఎస్‌కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...