- Home
- Sports
- Cricket
- లక్నో సూపర్ జెయింట్స్ లోగోలో బిగ్గెస్ట్ మిస్టేక్... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా...
లక్నో సూపర్ జెయింట్స్ లోగోలో బిగ్గెస్ట్ మిస్టేక్... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్రాండ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. రూ.7090 కోట్ల భారీ బిడ్‌తో ఐపీఎల్ జట్టును సొంతం చేసుకున్న ఆర్‌పీఎస్ గోయింకా సంస్థ, తాజాగా టీమ్ లోగోను విడుదల చేసిన విషయం తెలిసిందే...

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లపై రెండేళ్ల నిషేధం పడిన సమయంలో తాత్కాలికంగా ఆ ప్లేస్‌ను భర్తీ చేసిన పూణే సూపర్ జెయింట్స్ జట్టుకి యజమాని అయిన ఆర్‌పీఎస్ గోయింకా సంస్థ... పాత వాసనలు పోకుండా కొత్త జట్టును రూపొందించింది...
రైజింగ్ పూణే ప్లేస్‌లో లక్నో అని సిటీ పేరు మార్చడం తప్ప పేరులో పెద్దగా మార్పులు చేయలేదు. అలాగే లోగో విషయంలోనూ అంతే. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ లోగోను అచ్చుదింపినట్టు దింపేసింది లక్నో...
అయితే అప్పుడు రెక్కలు బంగారు వర్ణంలో మెరిసి పోతే, ఇప్పుడు లక్నో లోగోలో త్రివర్ణ పతకపు రంగులను అద్దారు. అలాగే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ లోగోలో రెక్కల మధ్యన బంతి ఉంటే, ఇక్కడ బ్యాటు కూడా వచ్చి చేరింది...
అంతే బాగానే ఉన్నా, లక్నో సూపర్ జెయింట్ లోగోలో ఓ పెద్ద తప్పు ఉందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. క్రికెట్‌లో ఫార్మాట్‌ను బట్టి బంతి రంగు మారుతూ ఉంటుంది...
సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఎరుపు రంగు బంతిని, డే- నైట్ టెస్టు మ్యాచులకు పింక్ కలర్ బంతిని వాడతారు. వన్డే, టీ20 వంటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతి రంగు తెలుపు... అందుకే టెస్టులకు రెడ్ బాల్ క్రికెట్ అని, వన్డే,టీ20లకు వైట్ బాల్ క్రికెట్ అని పిలుస్తారు...
అయితే లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీ లోగోలో బ్యాటు మధ్యన ఉన్న బంతి రెడ్ కలర్‌లో ఉంది. టీ20ల్లో టెస్టు బాల్‌ను పెట్టడం అంటే మావోళ్లు, టీ20లను టెస్టుల్లా ఆడతారని పరోక్షంగా హింట్ ఇవ్వడమే అవుతుందని అని ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్...
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా గత రెండు సీజన్లలో బరిలో దిగిన కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ గెలవడంలో ముందు వరుసలో నిలిచాడు. రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయినా, పరుగులు చేయడంలో మాత్రం వెనకబడలేదు...
అయితే కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆరెంజ్ క్యాప్ గెలవాలనే ఉద్దేశంతో కావాలని నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని ట్రోల్స్ వినిపించాయి...
అలాంటి ప్లేయర్‌ను కెప్టెన్‌గా ఎంచుకుని, ఏకంగా రూ.17 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన లక్నో ఫ్రాంఛైజీ... ఇలా లోగోలో రెడ్ బాల్ పెట్టడం చూస్తుంటే, ఏదో తేడా కొడుతోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
టీమ్ పేరు, టీమ్ లోగోను పాత జట్టు నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్న లక్నో సూపర్ జెయింట్... ఆఖరికి టీమ్ కెప్టెన్‌ను కూడా కాపీ కొట్టి, మరో ఫ్రాంఛైజీ నుంచి తెచ్చుకుందని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...