ఆరెంజ్ ఆర్మీ ఈసారి కూడా ఆఖరి ప్లేస్‌లోనే... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరుపై...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. 2013లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్, ఓ సారి టైటిల్ గెలిచి, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే గత సీజన్ నుంచి సన్‌రైజర్స్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత సీజన్‌ను టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది... అయితే వరుస పరాజయాలు, వివాదాలు, కెప్టెన్సీ మార్పులతో మూడంటే మూడు విజయాలతో టోర్నీ చరిత్రలో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు, గత సీజన్‌నే గుర్తుకుతెచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
టాపార్డర్ బ్యాటర్లు కేన్ విలియంసన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ తీవ్రంగా నిరాశపరచడంతో 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్ కొన్ని మెరుపులు మెరిపించి, ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించగలిగారు. కానీ ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయారు..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...
‘రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ కనబరిచింది. చూస్తుంటే వాళ్లు టాప్ 4లో ఉంటారనిపిస్తోంది. సన్‌రైజర్స్ మాత్రం దారణంగా ఆడింది...
టీమ్‌లో పోరాటపటిమ లేదు. అన్ని విభాగాల్లో డెప్త్ లేదు. చూస్తుంటే ఆఖరి స్థానంలో లేదా ఆఖరి రెండో స్థానంలో నిలవడానికి ఆరెంజ్ ఆర్మీ పోటీపడుతుందని అనిపిస్తుంది... ’ అంటూ ట్వీట్ చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్...
టీమ్ మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించి, టీమ్ నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... భారీ మూల్యం చెల్లించుకుంటోందని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్పిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న సీఎస్‌కేతో తలబడుతుంది ఆరెంజ్ ఆర్మీ...