- Home
- Sports
- Cricket
- ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ వెలగొచ్చు... భారీ లక్ష్యంపై కన్నేసిన సారా టెండూల్కర్ బాయ్ ఫ్రెండ్
ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ వెలగొచ్చు... భారీ లక్ష్యంపై కన్నేసిన సారా టెండూల్కర్ బాయ్ ఫ్రెండ్
Shubman Gill: మూడు సీజన్ల పాటు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన శుభమన్ గిల్ ను గతేడాది జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో మాత్రం గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో తమ జట్టు ఫైనల్ చేరితే..

భారత యువ ఆటగాడు, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాయ్ ఫ్రెండ్ (?) శుభమన్ గిల్ భారీ ప్రణాళికతో ఈ ఐపీఎల్ ప్రారంభించబోతున్నాడు. గతేడాది వరకు కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈ సీజన్ నుంచి హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తో కలిసి ప్రయాణించనున్నాడు.
అయితే రాబోయే ఐపీఎల్ గిల్ కు ఎంతో కీలకం. ఈ సీజన్ లో రాణించి ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాల్గొనబోయే టీ20 జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
ఇదే విషయమై అతడు తాజాగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ లో ఆడటమనేది ప్రతీ ఆటగాడికి చాలా పెద్ద విషయం. నా విషయానికొస్తే.. రాబోయే ఐపీఎల్ సీజన్ లో నేను గనక భాగా ఆడితే వరల్డ్ కప్ కు ఎంపికకాబోయే జట్టులో నా పేరు కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
ఐపీఎల్ లో భాగా రాణించిన ఆటగాళ్లకు టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఆ విధంగా.. ఐపీఎల్ లో నేను ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరి ఆపై ఫైనల్ వరకు వెళ్లగలిగితే మాత్రం ఈసారి ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా నాపేరు ఉంటుంది..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఓ ఆటగాడిగా తాను గుజరాత్ టైటాన్స్ కు ఏం చేయాలో అవన్నీ చేస్తానని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని గిల్ చెప్పాడు. వ్యక్తిగతంగానే గాక జట్టుగా కూడా తాము రాణించాల్సి ఉంటుందని గిల్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇన్నాళ్లు పుల్ షాట్ ఆడటంలో బలహీనతను ప్రదర్శించిన తనకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన టిప్స్ ఆధారంగా ఆ షాట్ ను సరిగ్గా ఆడగలుగుతున్నాని చెప్పాడు.
కేకేఆర్ తో అనుబంధం గురించి గిల్ మాట్లాడుతూ.. ‘కేకేఆర్ తోనే నా ఐపీఎల్ కెరీర్ ప్రారంభమైంది. 2018లో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ఆ తర్వాత ఓపెనర్ గా పంపారు. నాలుగో స్థానంలో కూడా ఆడించారు. ఆ తర్వాత ఏడాది ఏడో స్థానంలో ఆడాను. ఇక గతేడాది నన్ను టాపార్డర్ కు ప్రమోట్ చేశారు.
ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో వివిధ పాత్రలు పోషించాను. గత సీజన్ లో గాయం కారణంగా కాస్త ఇబ్బంది పడ్డాను. సీజన్ తొలి దశలో మాకు కలిసి రాలేదు. కానీ రెండో దశలో మాత్రం వరుస విజయాలతో ఫైనల్ కు చేరడం సంతోషాన్నిచ్చింది’ అని తెలిపాడు.
2018 నుంచి 2021 సీజన్ దాకా కోల్కతా తోనే ఆడిన గిల్.. మొత్తంగా ఆ జట్టు తరఫున 58 మ్యాచులాడాడు. ఇక గత సీజన్ లో 17 ఇన్నింగ్స్ లలో 478 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనలు చేసిన అతడిని ఈ సీజన్ లో కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. అయితే ఈ ఓపెనర్ ను రూ. 7 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.