- Home
- Sports
- Cricket
- వయసు పెరుగుతోందని తెలుసు, అందుకే... ఐపీఎల్ 2022 పర్పుల్ క్యాప్ హోల్డర్ ఉమేశ్ యాదవ్...
వయసు పెరుగుతోందని తెలుసు, అందుకే... ఐపీఎల్ 2022 పర్పుల్ క్యాప్ హోల్డర్ ఉమేశ్ యాదవ్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్, పర్పుల్ క్యాప్ వేటలో టాప్‌లో ఉంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ మాటకొస్తే ఉమేశ్ యాదవ్ కూడా దీన్ని అనుకొని ఉండడు. మూడు మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌ని నో బాల్‌తో ప్రారంభించిన ఉమేశ్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌ని డకౌట్ చేశాడు. మొదటి మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
రెండో మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ 2 వికెట్లు తీసిన ఉమేశ్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు...
Umesh Yadav KKR
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్, 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు...
ఉమేశ్ యాదవ్ అద్బుత స్పెల్ కారణంగా భారీ స్కోరు చేసేలా కనిపించిన పంజాబ్ కింగ్స్, 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
‘ నా వయసు పెరుగుతోందని తెలుసు. అందుకే నేను ఇంకా ఎక్కువగా కష్టపడడం మొదలెట్టా. అదీకాకుండా నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నా... కాబట్టి నాకు కావాల్సినంత సమయం దొరుకుతుంది...
ప్రాక్టీస్‌లో ఎక్కువ సమయం గడిపితే, ఆ రిజల్ట్ మ్యాచ్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న పర్ఫామెన్స్‌కి నా ప్రాక్టీస్, కోచ్‌లే కారణం... వాళ్ల పర్యవేక్షణలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నా...
140 కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేస్తున్నప్పుడు బంతిపై పూర్తి నియంత్రణతో స్టంప్స్‌కి వేయాల్సి ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఉమేశ్ యాదవ్...
ఐపీఎల్ కెరీర్‌లో 10 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఉమేశ్ యాదవ్, అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన పేసర్‌గా నిలిచాడు. ఇందులో ఆరు సార్లు కేకేఆర్ తరుపునే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు ఉమేశ్...