- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022లో అతనే స్పెషల్ అట్రాక్షన్... మూడు జట్ల తరుపున నాలుగు ఐపీఎల్ టైటిల్స్...
ఐపీఎల్ 2022లో అతనే స్పెషల్ అట్రాక్షన్... మూడు జట్ల తరుపున నాలుగు ఐపీఎల్ టైటిల్స్...
ఐపీఎల్‌లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. బేసి సంఖ్యతో ముగిసే ఏడాదిలోనే ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుస్తుందని, మొదటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, టైటిల్ గెలవదని... ఇలా చాలా నమ్మకాలు ఐపీఎల్‌లో ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో కర్ణ్ శర్మ కూడా చేరిపోయాడు...

ఉత్తరప్రదేశ్‌కి చెందిన కర్ణ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2009 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన కర్ణ్ శర్మ, ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకి ఆడాడు...
2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన కర్ణ్ శర్మ, ఓవరాల్‌గా 67 మ్యాచుల్లో 59 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 15.80 సగటుతో 316 పరుగులు చేశాడు...
2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ, ఆ తర్వాతి ఏడాది ముంబై ఇండియన్స్‌కి మారి, అక్కడ కూడా టైటిల్ గెలిచాడు...
ఆ తర్వాతి ఏడాది చెన్నై సూపర్ కింగ్స్, కర్ణ్ శర్మను ఏకంగా రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2018లో సీఎస్‌కే తరుపున 6 మ్యాచులు ఆడి 4 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ, ముచ్ఛటగా మూడో ఏడాది ఐపీఎల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...
వరుసగా మూడు సీజన్లలో మూడు వేర్వేరు జట్ల తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కర్ణ్ శర్మ...
ఐపీఎల్ 2019, 2020 సీజన్లలో కలిపి 6 మ్యాచులు ఆడి 6 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ, 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే సీఎస్‌కే, టైటిల్ గెలవడంలో ఐపీఎల్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రూ.50 లక్షలకు కర్ణ్ శర్మను కొనుగోలు చేసింది. కర్ణ్ శర్మ, ఆర్‌సీబీ రాత మారుస్తాడని ఆశపడుతున్నారు ఫ్యాన్స్...
అయితే ఆర్‌సీబీ దరిద్రాన్ని ఏ లక్కీ ప్లేయర్ కూడా మార్చలేడని గత సీజన్‌లోనే నిరూపితమైంది. ఐపీఎల్ 2021 వేలంలో రూ.4.8 కోట్లకు ఆసీస్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...
డాన్ క్రిస్టియన్ ఇంతకుముందు తాను ఆడిన టీ20 లీగ్‌లన్నింటిలోనూ తన జట్లకి టైటిల్స్ అందించాడు. 2010లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2011లో టీ20 బిగ్‌బాష్, 2013లో బీబీఎల్2, 2017లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2017లో సీపీఎల్, 2018లో ఎస్‌ఏ సూపర్ లీగ్, 2019లో బీబీఎల్8, 2020లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2021లో సిడ్నీ సిక్సర్స్ వంటి టైటిల్ అందుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్నాడు డానియల్ క్రిస్టియన్...
అయితే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ప్లేయర్‌గా టైటిల్ గెలవలేకపోయాడు డాన్ క్రిస్టియన్. క్రిస్టియన్ మాదిరిగానే కర్ణ్ శర్మ లక్, ఆర్‌సీబీకి కలిసి రాదని తేల్చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...