- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఆరంభానికి ముందే ఊహించని షాక్... లీగ్ నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్ జాసన్ రాయ్...
ఐపీఎల్ ఆరంభానికి ముందే ఊహించని షాక్... లీగ్ నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్ జాసన్ రాయ్...
ఐపీఎల్ ఆరంభానికి ముందే కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కి షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, హార్ధిక్ పాండ్యా టీమ్‌కి షాక్ ఇచ్చాడు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాసన్ రాయ్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు...
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అమ్ముడుపోని జాసన్ రాయ్, మిచెల్ మార్ష్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో సన్‌రైజర్స్ తరుపున బరిలో దిగాడు...
సెకండాఫ్‌లో బెయిర్ స్టో అందుబాటులో ఉండకపోవడంతో అతని స్థానంలో ఓపెనర్‌గా వచ్చి, మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదాడు జాసన్ రాయ్...
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కి కూడా ఆడిన జాసన్ రాయ్, పాక్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఆడి ఆరు మ్యాచుల్లో 170+ స్ట్రైయిక్ రేటుతో 300 పరుగులు చేశాడు...
ఈ ఏడాది జనవరిలో రెండో బిడ్డకు తండ్రి అయిన జాసన్ రాయ్, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పాల్గొన్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం రెండున్నర నెలల పాటు కుటుంబానికి దూరంగా బయో బబుల్‌లో గడపాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట జాసన్ రాయ్...
శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్‌తో అతనితో జాసన్ రాయ్‌ని ఓపెనర్‌గా ఆడించాలని భావించింది... రాయ్ తప్పుకోవడంతో అతని స్థానంలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది...
జాసన్ రాయ్‌కి రిప్లేస్‌మెంట్‌గా ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయాన్ని గుజరాత్ టైటాన్స్, ఇంకా ప్రకటించలేదు.
ఆసీస్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్‌తో పాటు సురేష్ రైనా వంటి స్టార్లు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే.