- Home
- Sports
- Cricket
- ఇది చాలా ఓవర్, పోలార్డ్ వెనక్కి తిరిగి రియాక్ట్ అయ్యుంటే... కృనాల్ పాండ్యాపై పార్థివ్ పటేల్ ఫైర్
ఇది చాలా ఓవర్, పోలార్డ్ వెనక్కి తిరిగి రియాక్ట్ అయ్యుంటే... కృనాల్ పాండ్యాపై పార్థివ్ పటేల్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్‌లో పాండ్యా బ్రదర్స్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టులో కలిసి రాణించిన హార్ధిక్, కృనాల్... ఇప్పుడు వేర్వేరు జట్ల తరుపున బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు...

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడుతున్న కృనాల్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచుల్లో 7 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లోనూ రాణించి 76 పరుగులు చేశాడు...
తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 1 పరుగుకే అవుటైన కృనాల్ పాండ్యా... బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి మెప్పించాడు...
ఆఖరి ఓవర్‌లో 39 పరుగులు కావాల్సిన దశలో 20వ ఓవర్ బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యా, మొదటి బంతికే కిరన్ పోలార్డ్‌ని అవుట్ చేశాడు. పోలార్డ్ అవుటై నిరాశగా పెవిలియన్ చేరుతున్న సమయంలో అతనికి వెనక నుంచి ఎగురుతూ హెల్మెట్‌కి ముద్దు ఇచ్చాడు కృనాల్ పాండ్యా...
ఇదే కృనాల్ పాండ్యాపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమవుతోంది. పోలార్డ్‌కి పాండ్యా బ్రదర్స్‌కి మంచి స్నేహం ఉంది. అయితే ఈ సీజన్‌లో పోలార్డ్ పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు...
ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో కలిపి 16.43 సగటుతో 115 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, బౌలింగ్‌లోనూ 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అదీకాక పోలార్డ్ అవుటయ్యే సమయానికి ముంబై ఓటమి ఖరారైపోయింది...
ఆ కోపం, చిరాకు కిరన్ పోలార్డ్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్...
‘కృనాల్ పాండ్యా, కిరన్ పోలార్డ్ మంచి స్నేహితులు. అయితే ఆన్ ఫీల్డ్‌లో భావోద్వేగాలు విభిన్నంగా ఉంటాయి. పోలార్డ్ మంచి ఫామ్‌లో లేడు. పరుగులు చేయలేకపోతున్నాడు.
ముంబై ఇండియన్స్ కూడా విజయాలు అందుకోలేకపోతోంది. ఇలాంటి సమయాల్లో వ్యక్తులకు కాస్త స్పేస్ ఇవ్వడం చాలా అవసరం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలా ఉన్నా, క్రీజులో ఉండడం ఎలాగో నేర్చుకోవాలి...
ఒకవేళ కిరన్ పోలార్డ్ వెనక్కి తిరిగి రియాక్ట్ అయ్యి ఉంటే, కృనాల్ పాండ్యా పరిస్థితి ఏమయ్యేది. ఓడిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అదీకాక ఓ ప్లేయర్ ఫామ్‌లో లేనప్పుడు ఇలాంటి ఓవర్ యాక్షన్ పనులు చేయకూడదు...
పోలార్డ్ మనసులో ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలీదు. నువ్వు ఆడిన పాత టీమ్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి రియాక్షన్ ఏ మాత్రం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పార్థివ్ పటేల్...
అయితే తనను అవుట్ చేసిన పోలార్డ్‌ను తాను అవుట్ చేసి... 1-1 తేడాతో సమం చేశానని... ఇప్పుడు అతను దీని గురించి తక్కువ మాట్లాడతాడని కామెంట్ చేశాడు కృనాల్ పాండ్యా...