- Home
- Sports
- Cricket
- శిఖర్ ధావన్‌ని తప్పించడం వెనక రాహుల్ ద్రావిడ్ హస్తం... గబ్బర్‌పై టీమిండియా హెడ్‌కోచ్‌కి...
శిఖర్ ధావన్‌ని తప్పించడం వెనక రాహుల్ ద్రావిడ్ హస్తం... గబ్బర్‌పై టీమిండియా హెడ్‌కోచ్‌కి...
ఐపీఎల్ 2022 సీజన్‌లోనే కాదు, గత 8 సీజన్లులగా ప్రతీ సీజన్‌లోనూ 400+ పరుగులు చేస్తూ వస్తున్నాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే టీమిండియా సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకర్షించడంలో వరుసగా విఫలమవుతున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 500+ పరుగులు చేసిన తర్వాత ధావన్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడే జట్టులో చోటు దక్కుతుందని భావించారంతా. అయితే కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్న సెలక్టర్లు, శిఖర్ ధావన్‌కి అవకాశం ఇవ్వలేదు...
భారత ప్రధాన జట్టు, ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన సమయంలో శ్రీలంకలో పర్యటించిన యువ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు శిఖర్ ధావన్. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ ధావన్‌కే కెప్టెన్సీ దక్కవచ్చని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు జట్టులో లేని సమయంలో శిఖర్ ధావన్‌కి అవకాశం దొరికితే, అతని అనుభవం జట్టుకి ఉపయోగపడుతుందని కూడా సెలక్టర్లు భావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది...
Shikhar Dhawan
‘గత దశాబ్దకాలంలో శిఖర్ ధావన్, భారత జట్టుకి ఎంతో చేశాడు. టీ20ల్లో కూడా అతని సేవలు మరువలేనివి. అయితే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది...
రాహుల్ ద్రావిడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మేమంతా ఆయన చెప్పిన దాన్ని అంగీకరించాల్సి వచ్చింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో తనకి చోటు ఉండదని రాహుల్ ద్రావిడ్ స్వయంగా శిఖర్ ధావన్‌కి చెప్పారు...
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ వంటి యంగ్ ప్లేయర్ల మధ్యలో 36 ఏళ్ల సీనియర్‌ని ఇరికించడం కష్టమని ద్రావిడ్ భావించారు. సంజూ శాంసన్‌ని కూడా అందుకు ఎంపిక చేయలేదు...
రాహుల్‌కి ఏం కావాలో స్పష్టమైన అవగాహన ఉంది. శిఖర్ ధావన్‌కి వన్డేల్లో తప్పకుండా చోటు ఉంటుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ శిఖర్ ధావన్ చోటుకి వచ్చిన ప్రమాదమేమీ లేదు. టీ20ల్లో మాత్రం కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ద్రావిడ్ చెప్పారు... మేం అదే పాటించాం...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేశాడు...
శిఖర్ ధావన్‌తో పాటు సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు దక్కకపోవడం వివాదాస్పదమైంది. ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న రాహుల్ త్రిపాఠి, ఈసారి తనకి టీమిండియాలో చోటు ఉంటుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు...