- Home
- Sports
- Cricket
- ఆర్‌సీబీ సరే! మిగిలిన టీమ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ప్రకటిస్తే ఏయే ప్లేయర్లకు చోటు ఇస్తారు...
ఆర్‌సీబీ సరే! మిగిలిన టీమ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ప్రకటిస్తే ఏయే ప్లేయర్లకు చోటు ఇస్తారు...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లా, ఐపీఎల్‌లోకి కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’ కాన్సెప్ట్ తీసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్‌సీబీకి ఏళ్ల పాటు సేవలు అందించిన ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్‌లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. దీంతో మిగిలిన జట్ల హాల్ ఆఫ్ ఫేమ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది...

15 సీజన్లలో ఒక్క టైటిల్ గెలవలేకపోయిన ఆర్‌సీబీ, ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ప్రకటించి... ఇద్దరు లెజెండరీ ప్లేయర్లను ఆత్మీయంగా సత్కరించడంతో మిగిలిన పాత 7 ఫ్రాంఛైజీలు ఈ కాన్సెప్ట్‌ని ఫాలో అయితే ఏ ప్లేయర్లకు అందులో చోటు దక్కుతుందో చూద్దాం...
Image Credit: Getty Images
చెన్నై సూపర్ కింగ్స్ హాల్ ఆఫ్ ఫేమ్: నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌లో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాకి తప్పనిసరిగా చోటు ఉండాల్సిందే. రైనాతో పాటు షేన్ వాట్సన్, డీజే బ్రావో, ఎమ్మెస్ ధోనీ (వచ్చే సీజన్‌లో రిటైర్ అయితే) లకు కూడా సీఎస్‌కే ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కడం సమంజసంగా ఉంటుంది...
ముంబై ఇండియన్స్ హాల్ ఆఫ్ ఫేమ్: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కి ఫైవ్ టైం టైటిల్ విన్నర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కి తీరుతుంది. అలాగే బౌలర్ లసిత్ మలింగ కూడా ముంబై ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకుంటాడు. వీరితో పాటు హర్భజన్ సింగ్‌కి ముంబై ఇండియన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కొచ్చు...
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్: కేకేఆర్‌కి కెప్టెన్‌గా రెండు టైటిల్స్ అందించిన గౌతమ్ గంభీర్‌కి ఆ జట్టు హాల్ ఆఫ్ ఫేమ్‌లో తప్పక చోటు ఉంటుంది. అలాగే కేకేఆర్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకడైన రాబిన్ ఊతప్ప, ఆల్‌రౌండర్లు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్‌లకు అవకాశం దక్కవచ్చు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ హాల్ ఆఫ్ ఫేమ్: 2016 సీజన్‌లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నిర్మొహమాటంగా డేవిడ్ వార్నర్‌కి చోటు ఇవ్వాల్సిందే. అలాగే ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్న రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌లకు ఆరెంజ్ ఆర్మీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కాలి..
రాజస్థాన్ రాయల్స్ హాల్ ఆఫ్ ఫేమ్: 2008 సీజన్‌లో టైటిల్ గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మాజీ కెప్టెన్, మాజీ కోచ్ షేన్ వాట్సన్‌కి చోటు దక్కుతుంది. అలాగే రాజస్థాన్ తరుపున 3 వేలకు పైగా పరుగులు చేసిన అజింకా రహానేకి కూడా ఈ లిస్టులో చోటు దక్కడం సమంజసం...
ఢిల్లీ క్యాపిటల్స్ హాల్ ఆఫ్ ఫేమ్: ఢిల్లీ క్యాపిటల్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్పిన్నర్ అమిత్ మిశ్రాకి తప్పకుండా చోటు ఉంటుంది. ఢిల్లీ తరుపున 103 మ్యాచులు ఆడిన మిశ్రా 110 వికెట్లు పడగొట్టాడు. అలాగే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఢిల్లీ తరుపున 86 మ్యాచులాడి 1883 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ హాల్ ఆఫ్ ఫేమ్: ప్రతీ సీజన్‌కి ప్లేయర్లను, టీమ్‌ని, లోగోను మార్చే పంజాబ్ కింగ్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఏ ప్లేయర్లకు చోటు దక్కుతుందని చెప్పడం కష్టమే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ తరుపున ఏ ప్లేయర్ కూడా 90 మ్యాచులు కూడా ఆడలేకపోయాడు. అత్యధికంగా పియూష్ చావ్లా 87 మ్యాచులు ఆడాడు..