వాడిని ఎందుకు రిటైన్ చేసుకున్నారు, దండగ!... ఆర్‌సీబీపై పార్థివ్ పటేల్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టైటిల్ గెలవకుండా అడ్డుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ లీగ్ స్టేజీకే పరిమితం కావడంతో ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు చిగురించాయి...

Image credit: PTI
రెండు సీజన్ల తర్వాత ఎలిమినేటర్ గండాన్ని దాటి, రెండో క్వాలిఫైయర్‌కి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది...
రెండో క్వాలిఫైయర్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలం కావడం టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. కీలక మ్యాచ్‌లో ప్లేయర్లు చేతులెత్తేయడంతో ఆర్‌సీబీ ఫైనల్ చేరలేకపోయింది...
Glenn Maxwell
‘ఆర్‌సీబీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రిటైన్ చేసుకోవడం చూసి నేను షాక్ అయ్యా. అతను ఆడింది ఒకే ఒక్క సీజన్. అందులో కాస్త మెరుగ్గా పరుగులు చేశాడు...
Glenn Maxwell
ఐపీఎల్‌లో అతని పర్ఫామెన్స్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతీ ఐదు సీజన్ల తర్వాత ఓ సారి అతను మంచిగా ఆడతాడు. ఆ పర్ఫామెన్స్‌తోనే కోట్లు జేబులో వేసుకుంటున్నాడు...
అలాంటి ప్లేయర్, ప్రతీ ఏడాది ఆడతాడని ఆశలు పెట్టుకోవడమే ఆర్‌సీబీ చేసిన దండగ పని. ఐపీఎల్ 2022 సీజన్‌లో రిటైన్ చేసుకున్న ప్లేయర్లు సరిగ్గా ఆడకపోవడమే ఆ ఫ్రాంఛైజీని దెబ్బతీసింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచుల్లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది ఆర్‌సీబీ. అతను ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో కలిపి 301 పరుగులు మాత్రమే చేసి పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు...
అలాగే రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న మహ్మద్ సిరాజ్, 15 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేలానికి వదిలేసిన యజ్వేంద్ర చాహాల్, రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొడుతూ పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు..