హెట్మయర్ భార్య ప్రసవించింది, ఇప్పుడు ఆయన... మరోసారి నోరుజారిన సునీల్ గవాస్కర్...
టీమిండియా మాజీ క్రికెటర్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ కామెంటేటర్ ఎంత సక్సెస్ సాధించాడో తెలీదు కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ, ఆయన భార్య గురించి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన గవాస్కర్, తాజాగా విండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, ఆయన భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు...

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలో విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఫామ్ గురించి ‘లాక్‌డౌన్ సమయంలో విరాట్, అనుష్కతో చేసిన ప్రాక్టీస్ సరిపోదు... వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కునేందుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి...’ అంటూ వివాదాస్పద కామెంట్లు చేశాడు సునీల్ గవాస్కర్...
Sunil Gavaskar
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా గవాస్కర్‌పై మండిపడింది. పెద్దాయన అలా అనడం కరెక్ట్ కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది...
ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ మరణం తర్వాత ‘షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ కాదు, అతనో సాధారణ స్పిన్నర్. షేన్ వార్న్ కంటే ముత్తయ్య మురళీధరన్ వంటి మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు...’ అంటూ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి...
షేన్ వార్న్ మరణం తర్వాత సంతాపం వ్యక్తం చేయాల్సింది పోయి, సాధారణ స్పిన్నర్ అని విమర్శించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. దీంతో సునీల్ గవాస్కర్ తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ క్షమాపణలు కోరాల్సి వచ్చింది...
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న విండీస్ ప్లేయర్ సిమ్రాన్ హెట్మయర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు సునీల్ గవాస్కర్... కొన్నిరోజుల కిందట హెట్మయర్ సతీమణి ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే...
‘హెట్మయర్ భార్య ప్రసవించింది. ఇప్పుడు రాయల్స్‌కి అతను డెలివర్ చేస్తాడా...’ అంటూ కామెంటరీ బాక్సులో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు, మరోసారి ఈ మాజీ క్రికెటర్‌ను వివాదాల్లోకి నెట్టేశాయి...
Gavaskar slams Sanju
జోకులు చేయడానికి కూడా ఓ హద్దు, సంస్కారం అనేవి ఉంటాయని, అవి కూడా మరిచిపోయి సునీల్ గవాస్కర్... జూనియర్ క్రికెటర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన క్రికెటర్‌గా సాధించిన గౌరవాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుందని అంటున్నారు నెటిజన్లు..
సునీల్ గవాస్కర్‌పై కాస్తో కూస్తో మిగిలి ఉన్న గౌరవం నిలబడాలంటే ఆయన ఇకపై కామెంటేటర్‌గా చేయకపోవడం మంచిదని సలహాలు ఇస్తున్నారు...