- Home
- Sports
- Cricket
- హార్ధిక్, రైనా, బుమ్రా, కోహ్లీ... వయసులో పెద్దవాళ్లను పెళ్లాడిన భారత క్రికెటర్లు వీరే...
హార్ధిక్, రైనా, బుమ్రా, కోహ్లీ... వయసులో పెద్దవాళ్లను పెళ్లాడిన భారత క్రికెటర్లు వీరే...
ప్రేమకి వయసుతో సంబంధం లేదు కానీ పెళ్లికి కావాలి. పెళ్లాడేటప్పుడు అమ్మాయి వయసు తక్కువ, అబ్బాయి వయసు కాస్త ఎక్కువ ఉండాలంటారు పెద్దలు. అయితే భారత క్రికెటర్లలో చాలామంది ఈ రూల్‌ని బ్రేక్ చేసినవాళ్లే. సచిన్ టెండూల్కర్- అంజలి ప్రేమకథ అందరికీ తెలిసినా... మిగిలిన వాళ్ల లవ్‌స్టోరీకి రావాల్సినంత పబ్లిసిటీ అయితే రాలేదు...

హార్ధిక్ పాండ్యా: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సెర్బియన్ నటి, బాలీవుడ్ మోడల్ నటాశా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లికి ముందే తండ్రి కూడా అయిన హార్ధిక్ పాండ్యా కంటే నటాశా దాదాపు రెండేళ్లు పెద్దది.
రాబిన్ ఊతప్ప: 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో భాగస్వామి ఉన్న ప్లేయర్ రాబిన్ ఊతప్ప. ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడిన రాబిన ఊతప్ప, భారత టెన్నిస్ ప్లేయర్ శీతల్ గౌతమ్‌ను ప్రేమించి పెళ్లాడాడు... రాబిన్ ఊతప్ప కంటే శీతల్ వయసులో నాలుగేళ్లు పెద్దది...
సురేశ్ రైనా: ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు సురేశ్ రైనా. అయితే ఈసారి మెగా వేలంలో సురేశ్ రైనా అమ్ముడుపోకపోయినా, కామెంటేటర్‌గా అదరగొడుతున్నాడు. రైనా, తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని ప్రేమించి పెళ్లాడాడు. ఒకే ఏడాదిలో జన్మించినా ప్రియాంక చౌదరి, సురేశ్ రైనా కంటే నాలుగు నెలలు పెద్దది...
Image: Anushka Sharma, Virat Kohli/Instagram
విరాట్ కోహ్లీ: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ తెచ్చుకున్న భారత సెలబ్రిటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి, పెళ్లాడాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కంటే అనుష్క శర్మ ఏడాది పెద్దది...
ఇర్ఫాన్ పఠాన్: టీమిండియా తరుపున టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ కూడా తనకంటే వయసులో పెద్దదైన దుబాయ్‌కి చెందిన సబా బైగ్‌ను ప్రేమించి పెళ్లాడాడు.
వెంకటేశ్ ప్రసాద్: టీమిండియా మాజీ మీడియం పేసర్ వెంకటేశ్ ప్రసాద్, జయంతిని ప్రేమించి పెళ్లాడాడు. అయితే అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న జయంతి, వెంకటేశ్ ప్రసాద్ కంటే 9 ఏళ్లు పెద్దది...
అనిల్ కుంబ్లే: టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అనిల్ కుంబ్లే. క్రికెట్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ కుంబ్లే చాలా క్లీన్ పర్సన్... 1999లో తన భర్తతో విడాకులు తీసుకున్న చేతనను ప్రేమించి పెళ్లాడాడు అనిల్ కుంబ్లే. తన కూతుర్ని భర్త దగ్గర్నుంచి తనదగ్గరకు తెచ్చుకోవడానికి చేతనకు సాయం చేసిన కుంబ్లే, తర్వాత ఆమె చేయి అందుకుని వివాహం చేసుకున్నాడు. చేతన కుంబ్లే కంటే రెండేళ్లు పెద్దది...
Image Credit: Sanjana Ganesan Instagram
జస్ప్రిత్ బుమ్రా: భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడాడు. జస్ప్రిత్ బుమ్రా వయసు 28 ఏళ్లు కాగా సంజన గణేశన్ వయసు 31 ఏళ్లు...
స్టువర్ట్ బిన్నీ: భారత మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, స్పోటర్ట్స్ యాంకర్ మయంతి లంగర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ 1985లోనే జన్మించినా, బిన్నీ కంటే మయంతి నాలుగు నెలలు పెద్దది...