- Home
- Sports
- Cricket
- IPL: ఢిల్లీకి గుడ్ న్యూస్.. ఆ బౌలర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎస్ఎ.. ఏప్రిల్ రెండో వారం నుంచి బరిలోకి..
IPL: ఢిల్లీకి గుడ్ న్యూస్.. ఆ బౌలర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎస్ఎ.. ఏప్రిల్ రెండో వారం నుంచి బరిలోకి..
Anrich Nortje: గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా గాయపడి ఐదు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న దక్షిణాఫ్రికా సీమర్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు అన్రిచ్ నోర్త్జ్ రెండ్రోజుల క్రితమే ముంబైకి చేరాడు. అయితే తొలి రెండు మ్యాచులకు మాత్రం...

ఈనెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కీలక ఆటగాడు, దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్త్జ్ ఐపీఎల్ లో ఆడటానికి ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది.
అయితే అతడిని వైద్యులు పరీక్షించి.. ఫిట్ గా ఉన్నాడంటేనే ఐపీఎల్ ఆడేందుకు అనుమతిస్తామనే షరతుతో సీఎస్ఏ.. ఇండియాకు పంపింది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితమే నోర్త్జ్ ముంబైకి చేరుకున్నాడు.
ప్రస్తుతం క్వారంటైన్ లో గడుపుతున్న అతడు.. ఏప్రిల్ రెండో వారం నుంచి సెలెక్షన్ కు అందుబాటులోకి ఉండనున్నట్టు సమాచారం. 2020 సీజన్ నుంచి ఢిల్లీ కి ఆడుతున్న ఈ దక్షిణాఫ్రికా పేసర్ ను ఆ ఫ్రాంచైజీ.. ఈ సీజన్ కు ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో రూ. 6.25 కోట్లతో రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్-14వ సీజన్ సందర్భంగా గాయపడ్డ అతడు ఐదు నెలలుగా విశ్రాంతికే పరిమితమయ్యాడు. స్వదేశంలో టీమిండియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ తో పాటు సఫారీ జట్టు గత నెలలో పర్యటించిన న్యూజిలాండ్ టూర్ కు కూడా అందుబాటులో లేడు.
ఈ నేపథ్యంలో 2022 సీజన్ లో అతడు ఢిల్లీకి ఆడతాడా..? లేదా..? అని అనుమానాలు రేకెత్తాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ నెల 20న ముంబైకి చేరుకున్న నోర్త్జ్.. ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగబోయే మ్యాచులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ లో 24 మ్యాచులాడిన ఈ సౌతాఫ్రికా పేసర్.. 34 వికెట్లు తీశాడు. గత సీజన్ లో 8 మ్యాచులాడి 12 వికెట్లు పడగొట్టాడు.
ఈ నెల 26న ఆరంభం కాబోయే ఐపీఎల్-15 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్.. తన తొలి మ్యాచును ముంబై ఇండియన్స్ తో మార్చి 27న ఆడనున్నది.