MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL: క్యాష్ రిచ్ లీగ్ లో సారథుల సంపాదన ఎంతంటే.. రిటైర్ అయినా ధోని తగ్గేదేలే..

IPL: క్యాష్ రిచ్ లీగ్ లో సారథుల సంపాదన ఎంతంటే.. రిటైర్ అయినా ధోని తగ్గేదేలే..

Net worth Of IPL 2022 Captains: ఐపీఎల్-15 సీజన్ కు సర్వం సిద్ధమైంది.    మరో నాలుగు రోజుల్లో మెగా సీజన్ కు  తెరలేవనుంది.   ఈ మేరకు ఇప్పటికే ఆయా జట్లన్నీ వారికి కేటాయించిన హోటల్స్ కు చేరుకున్నాయి.  ఈ నేపథ్యంలో  పది జట్లకు చెందిన సారథుల సంపాదన ఎంత ఉందో తెలుసుకుందాం. 

4 Min read
Srinivas M
Published : Mar 22 2022, 07:59 PM IST| Updated : Mar 22 2022, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
IPL Team Skippers

IPL Team Skippers

భారత క్రికెట్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  క్యాష్ రిచ్ లీగ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఐపీఎల్  బీసీసీఐకే గాక క్రికెటర్లకూ కాసులు కురిపిస్తున్నది. ఆటగాళ్ల సంగతి కాసేపు అటుంచితే  సారథుల సంపాదన ప్రతి ఏడాదికి అందనంత ఎత్తుకు పెరుగుతుంది.

212
ipl 2019

ipl 2019

ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 లో  పది ఫ్రాంచైజీలకు సారథులుగా వ్యవహరిస్తున్న కెప్టెన్ల నికర సంపాదనను.. ఆర్థిక వివరాలు సేకరించే పలు జాతీయ వెబ్సెట్లు ప్రచురించాయి.  ఈ నివేదికల ప్రకారం మన నాయకుల సంపాదన ఎంత ఉందో ఇక్కడ చూద్దాం. 

312
Mayank agarwal

Mayank agarwal

1.మయాంక్ అగర్వాల్ :  పంజాబ్ కింగ్స్ కు 13వ సారథిగా నియమితుడైన మయాంక్  సంపాదన  రూ. 26 కోట్లు. ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో అతడిని  పంజాబ్ జట్టు రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.  ఐపీఎల్ సాలరీని పక్కనబెడితే అతడు సీయట్, ఇతర క్రీడా ఉత్పత్తుల బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్నాడు. వీటితో పాటు బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా మయాంక్ కు ఏటా రూ. 1 కోటి ఆదాయం వస్తున్నది. భారత్ తరఫున ఎక్కువగా టెస్టులలో కనిపించే అగర్వాల్ కు ఒక్క టెస్టు ద్వారా రూ. 15 లక్షలు ముడతాయి. స్పోర్టింగ్ క్రేజ్ నివేదిక ప్రకారం.. అగర్వాల్ నికర సంపాదన రూ. 26 కోట్లు 

412
Rishabh pant

Rishabh pant

2. రిషభ్ పంత్ : ఢిల్లీ క్యాపిటల్స్ సారథి  పంత్ నికర సంపాదనను రూ. 36 కోట్లుగా అంచనా వేసింది స్పోర్ట్స్ అన్ఫోల్డ్.  పంత్ కు ఐపీఎల్ సాలరీ (2022 సీజన్ కు గాను రూ. 16 కోట్లు) తో పాటు డిష్ టీవీ, క్యాడ్బరీ ఫ్యూస్, బూస్ట్, జెఎస్ డబ్ల్యూ వంటి బ్రాండ్లకు ప్రమోటర్ గా ఉన్నాడు. బీసీసీఐ  కాంట్రాక్టు ద్వారా యేటా రూ. 5 కోట్లు దక్కుతాయి. 

512
Hardik Pandya

Hardik Pandya

3. హార్థిక్ పాండ్యా : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యా నికర సంపాదన ను రూ. 37 కోట్లుగా లెక్కగట్టింది ఫస్ట్ స్పోర్ట్స్. ఈ సీజన్ లో గుజరాత్ కు కొత్త సారథిగా ఎంపికైన అతడికి రూ. 15 కోట్లు దక్కాయి. బీసీసీఐతో కాంట్రాక్టు ద్వారా పాండ్యాకు యేటా రూ. 1 కోటి రూపాయలు దక్కుతాయి. డ్రీమ్ 11, మోన్స్టార్ ఎనర్జీ డ్రింక్, ఒప్పో, హల ప్లే, గల్ఫ్ ఆయిల్ ఇండియాకు పాండ్యా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. 

612
Sanju Samson

Sanju Samson

4. సంజూ శాంసన్ :  ఈ కేరళ కుర్రాడి సంపాదనను రూ. 52 కోట్లుగా లెక్కగట్టింది ఖేల్ తక్.  ఐపీఎల్ 2022 లో సంజూను రూ. 14 కోట్లకు దక్కించుకుంది రాజస్థాన్. గతంలో సంజూ ఎంఆర్ఎఫ్, కోకబుర, ఎస్ఎస్ కు ప్రమోటర్ గా ఉన్నాడు. శాంసన్ కు బీసీసీఐ తో కాంట్రాక్టు లేదు.
 

712
Shreyas Iyer

Shreyas Iyer

5. శ్రేయస్ అయ్యర్ : ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరగొడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయస్ నికర సంపాదన  రూ. 53 కోట్లుగా ఉన్నట్టు ఇండియా ఫాంటసీ అంచనా వేసింది.  ఇటీవలే  ముగిసిన వేలంలో అతడిని కేకేఆర్ రూ. 12.25 కోట్లతో దక్కించుకుంది. ఇక బీసీసీఐ గ్రేడ్ బి కాంట్రాక్టుకు కూడా ఇటీవలే ఎంపికయ్యాడు. దీని ద్వారా అతడికి ఏడాదికి రూ. 3 కోట్లు దక్కుతాయి. జిల్లెట్, బోట్, గూగుల్ పిక్సల్, మాన్యవర్, సీయట్ లకు అయ్యర్ అంబాసిడర్ గా ఉన్నాడు. 

812
kane williamson

kane williamson

6. కేన్ విలియమ్సన్ :  సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్  నికర సంపాదన రూ. 58 కోట్లుగా ఉన్నట్టు స్పోర్ట్స్ అన్ఫోల్డ్ అంచనా వేసింది. ఐపీఎల్  2022 సీజన్ లో రూ. 14 కోట్లతో ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది. ఇక న్యూజిలాండ్ క్రికెట్ అతడికి యేటా రూ. 27 లక్షలు చెల్లిస్తుంది.  బీసీసీఐ కాంట్రాక్టులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సీ గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే  ప్రతి ఏడాది  కోటి రూపాయలు చెల్లిస్తుంది బీసీసీఐ. 

912
KL Rahul

KL Rahul

7. కేఎల్ రాహుల్ :  లక్నో సూపర్ జెయింట్స్ కు  కెప్టెన్ అయిన రాహుల్  నికర సంపాదనను రూ. 75 కోట్లుగా లెక్కగట్టింది కాక్ నాలెడ్జ్. ఈ ఐపీఎల్ లో అతడిని రూ. 17 కోట్లతో లక్నో రిటైన్ చేసుకున్నది. ఇక బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా అతడికి  రూ. 5 కోట్లు దక్కుతాయి.  మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఈ స్పెషలిస్టు బ్యాటర్ కు టెస్టులకు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు (మ్యాచ్ చొప్పున) దక్కుతాయి.  రాహుల్.. పూమా, రియల్ మి, గేమ్జీ, బోట్ లతో పాటు మరికొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. 

1012
Faf Duplesis

Faf Duplesis

8.  ఫాఫ్ డుప్లెసిస్ :  ఏ దేశంలో లీగ్ అయినా కనిపించే సఫారీ మాజీ సారథి డుప్లెసిస్ ను ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో రూ. 7 కోట్లతో దక్కించుకుంది ఆర్సీబీ. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడి నికర సంపాదన రూ. 102 కోట్లుగా ఉన్నట్టు ఫస్ట్ స్టోర్ట్స్ లెక్కగట్టింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో రూ. 3 కోట్ల కాంట్రాక్టు ఉన్న డుప్లెసిస్.. బంగ్లా ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ఓమన్ క్రికెట్ లీగ్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్లో మెరుస్తాడు. 

1112
Rohit Sharma

Rohit Sharma

9. రోహిత్ శర్మ : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ నికర సంపాదన రూ. 180 కోట్లు అని కాక్ నాలెడ్జ్ తెలిపింది. ఈ ఏడాది ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో రోహిత్ ను ముంబై రూ. 16 కోట్లు పెట్టి దక్కించుకుంది. బీసీసీఐతో కాంట్రాక్టు ద్వారా హిట్ మ్యాన్ కు  యేటా రూ. 7 కోట్లు దక్కుతాయి. మూడు ఫార్మాట్లలో ఆడినందుకు మ్యాచ్ ఫీజులు వస్తాయి. వీటితో పాటు ఆడిడాప్, సీయట్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, నిస్సాన్ వంటి ఫేమస్ బ్రాండ్లకు అతడు బ్రాండ్ అంబాసిడర్. 

1212
MS Dhoni

MS Dhoni

10. ఎంఎస్ ధోని :  టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆఖరు సీజన్ (?) ఆడుతున్న ధోని నికర సంపాదన ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. పలు నివేదికల ప్రకారం.. ధోని సంపాదన ఏడాదికి రూ. 819 కోట్లుగా ఉంది. టీమిండియా నుంచి రిటైరైనా కూడా అతడి బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. వయసు మీద పడుతున్నా బ్రాండ్లు ఇప్పటికీ అతడి చుట్టే తిరగుతున్నాయి. గతేడాది ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో ధోనిని రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకుంది చెన్నై. ఇక ప్రపంచంలోని టాప్ బ్రాండ్లకు ధోని అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
Recommended image2
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆసీస్ డామినేషన్!
Recommended image3
ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved