ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ ఫైనల్ చేరలేకపోవడానికి ఐదు కారణాలివే... ఆ తప్పులు చేసి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఫ్యాన్స్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది ఆర్‌సీబీ. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడి, టైటిల్‌కి రెండు అడుగుల దూరంలోనే నిలిచింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవలేకపోవడానికి ఐదు కారణాలు ఇవే...

Image credit: PTI
విరాట్ కోహ్లీ: ఆర్‌సీబీకి బలం విరాట్ కోహ్లీయే. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ వంటి జట్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ పర్ఫామెన్స్ మీద ఆధారపడే ఆర్‌సీబీ విజయాల శాతం నిర్ణయించబడుతుంది. 9 సీజన్ల తర్వాత ఈ సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగిన విరాట్ కోహ్లీ, 16 మ్యాచుల్లో కలిపి 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్రీజులో నిలుదొక్కుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్న విరాట్, రెండో క్వాలిఫైయర్‌లో రెండో ఓవర్‌లోనే అవుటై జట్టుని ఒత్తిడిలో పడేశాడు...
ఫాప్ డుప్లిసిస్: ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఫాఫ్ డుప్లిసిస్. అతన్ని నమ్మి కెప్టెన్సీ అప్పగించింది ఆర్‌సీబీ. అయితే గత సీజన్‌లో 633 పరుగులు చేసిన ఫాఫ్, ఈ సీజన్‌లో 468 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కీలక మ్యాచుల్లో డుప్లిసిస్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఫెయిల్ అయ్యాడు...
Glenn Maxwell
గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఐపీఎల్ 2021 సీజన్‌లో 14.25 కోట్లకు మ్యాక్స్‌వెల్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. గత సీజన్‌లో 513 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన మ్యాక్స్‌వెల్‌ని రూ.11 కోట్లకి రిటైన్ చేసుకుంది బెంగళూరు. అయితే మ్యాక్స్‌వెల్ మెరుపులు ఈ సీజన్‌లో కనిపించలేదు. 13 మ్యాచుల్లో 301 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేశాడు...
మహ్మద్ సిరాజ్: ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగానే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు మహ్మద్ సిరాజ్. అయితే ఈ సీజన్‌లో సిరాజ్ బౌలింగ్‌లో మెరుపులు కనిపించకపోవడం ఆర్‌సీబీపై తీవ్రంగా ప్రభావం చూపింది. 15 మ్యాచుల్లో 9 వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్ 10.08 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. గత సీజన్‌లో సిరాజ్ ఎకానమీ 6.78 మాత్రమే. ఈ సీజన్‌లో 30+ సిక్సర్లు సమర్పించిన సిరాజ్, ఆర్‌సీబీ ఫెయిల్యూర్‌కి ఓ కారణంగా మిగిలిపోయాడు..
వానిందు హసరంగ: వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకొన్న వానిందు హసరంగ, ఐపీఎల్ 2022లో 16 మ్యాచుల్లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు. అయితే ఆర్‌సీబీలో యజ్వేంద్ర చాహాల్ చేసినట్టుగా హసరంగ ఎకానమీ మెయింటైన్ చేయలేకపోయాడు. యజ్వేంద్ర చాహాల్ పొదుపుగా బౌలింగ్ చేసి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేవాడు. హసరంగ వికెట్లు తీసినా, అతని ఎకానమీ 7.54గా ఉంది. అదీకాకుండా సిరాజ్ తర్వాత ఒకే సీజన్‌లో 30 సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు హసరంగ.
ఏబీ డివిల్లియర్స్: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఏబీ డివిల్లియర్స్‌ని చాలా మిస్ అయ్యింది. దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా అదరగొట్టి చాలా మ్యాచుల్లో ఆర్‌సీబీకి విజయాలు అందించాడు. నిజానికి ఆర్‌సీబీ క్వాలిఫైయర్ దాకా వచ్చిందంటే దినేశ్ కార్తీక్ కూడా ఓ కారణం. అయితే ఏబీ డివిల్లియర్స్ మ్యాజిక్‌ని రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీ మిస్ అయ్యింది...