- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 ఫైనల్‌కి పోటెత్తనున్న జనసంద్రం... లక్షకు పైగా టికెట్లు, నిమిషాల్లో సేల్...
ఐపీఎల్ 2022 ఫైనల్‌కి పోటెత్తనున్న జనసంద్రం... లక్షకు పైగా టికెట్లు, నిమిషాల్లో సేల్...
74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 క్లైమాక్స్‌కి చేరుకుంది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరిన సంగతి తెలిసిందే...

టేబుల్ టాపర్‌గా 10 విజయాలతో గుజరాత్ టైటాన్స్... ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిస్తే మరో న్యూ ఎంట్రీ లక్నో సూపర్ జెయింట్స్ కూడా అదిరిపోయే ఆటతో సెమీస్‌లో అడుగుపెట్టింది...
రాజస్థాన్ రాయల్స్, టాప్ 2గా నిలిచి ప్లేఆఫ్స్ లోకి రాయల్ ఎంట్రీ ఇవ్వగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్కీగా వరుసగా మూడో సీజన్‌లో నాకౌట్ స్టేజీలోకి దూసుకొచ్చింది...
మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫైయర్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది...
IPL Fans
మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోతున్నాయి. ఈ రెండు మ్యాచులు ముగిసిన తర్వాత రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ తరలివెళ్తాయి మూడు జట్లు...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయించింది బీసీసీఐ. కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో 100 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐకి అనుమతి దక్కింది...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కెపాసిటీ లక్షా 32 వేలు. అయితే కొన్ని స్టాండ్స్ ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవడంతో లక్ష మందికి పైగా జనాన్ని స్టేడియానికి అనుమతించబోతున్నారు...
ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌కి ముందు గంటపాటు ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలు జరుగుతాయి. దీనికి బాలీవుడ్ ప్రముఖుల హాజరుకాబోతున్నారు...
ఫైనల్ మ్యాచ్‌కి రూ.800 నుంచి 65 వేల వరకూ ధరతో టికెట్లు విక్రయించింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. వీఐపీ స్టాండ్స్ టికెట్ల ధర రూ.65 వేలు కాగా ఆ తర్వాత రూ.50,000, రూ. 20 వేలు, రూ.14 వేలు, రూ.7500, రూ.4500, రూ.3500, రూ.2500, రూ.2000, రూ.1500, రూ.800 రేంజ్‌లో టికెట్లను విక్రయించింది...
ఫైనల్ మ్యాచ్‌కి టికెట్ల బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. రూ.65 వేలు పెట్టి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కూడా ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిచూపించడం విశేషం...
కరోనా నిబంధనల కారణంగా రెండున్నరేళ్లుగా ప్రేక్షకులు లేకుండా లేదా రూ.25 శాతం, రూ.50 శాతం కెపాసిటీతో మ్యాచులను చూడాల్సి వచ్చింది. అయితే ఐపీఎల్ 2022 ఫైనల్ ద్వారా మళ్లీ స్టేడియాల్లో నూటికి నూరు శాతం జనాలతో కళకళలాడబోతున్నాయి...