- Home
- Sports
- Cricket
- ఈసారి కూడా సీఎస్‌కేదే టైటిల్, ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి! ఐపీఎల్ 2022 సీజన్ గురించి...
ఈసారి కూడా సీఎస్‌కేదే టైటిల్, ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి! ఐపీఎల్ 2022 సీజన్ గురించి...
ఐపీఎల్ 2022 సీజన్‌కి మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 10 జట్లు పాల్గొనబోతునన ఐపీఎల్ 2022 సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌దే టైటిల్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌ని 11 ఏళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ 2011 సీజన్ మధ్య చాలా పోలీకలు ఉన్నాయి. 2011 సీజన్‌లో కూడా 10 జట్లు పాల్గొన్నాయి...
10 ఫ్రాంఛైజీలు కావడంతో 2022 సీజన్‌లాగే 2011 సీజన్ కూడా గ్రూప్ ఫార్మాట్‌లోనే జరిగింది. యాదృచ్ఛికంగా అప్పుడు కూడా మొదటి మ్యాచ్ సీఎస్‌కే, కేకేఆర్ మధ్యే జరిగింది...
2010 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ గెలిచి, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2011 సీజన్ ఆడింది. ఇప్పుడు కూడా 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2022 సీజన్ ఆడనుంది...
2010 సీజన్‌లో ఢిల్లీకి ఆడిన గౌతమ్ గంభీర్‌ను వేలంలో భారీ ధరకు (రూ.11.04 కోట్లకు) కొనుగోలు చేసింది కేకేఆర్.
ఇప్పుడు కూడా 2021 సీజన్‌లో ఢిల్లీకి ఆడిన శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా...
2011 సీజన్ ఆరంభానికి ముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కారణంగా సీఎస్‌కే కెప్టెన్, భారత వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీపై గుర్రుగా ఉన్నారు కేకేఆర్ అభిమానులు...
2021 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న ప్రస్తుత భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కోపంగా ఉన్నారు కోల్‌కత్తా ఫ్యాన్స్...
అన్నింటికీ మించి 2010 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో శ్రీలంకలో ఫైనల్‌లో ఓడింది. అప్పటి ఐసీసీ టోర్నీ రన్నరప్ టీమ్ కెప్టెన్ కుమార సంగర్కర, హైదరాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు...
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి చవిచూసింది న్యూజిలాండ్. ప్రస్తుత ఐసీసీ టోర్నీ రన్నరప్ టీమ్ కెప్టెన్ కేన్ విలియంసన్, సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు...
ఆ లెక్కన ఐపీఎల్ 2011 సీజన్ రిజల్ట్, ఈసారి రిపీట్ అవుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అప్పటి ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి, టైటిల్ సొంతం చేసుకుంది సీఎస్‌కే...
ఎలాగూ ఎమ్మెస్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అనే ప్రచారం జరుగుతుండడంతో చెన్నై సూపర్ కింగ్స్, మరోసారి వరుసగా రెండో టైటిల్ సొంతం చేసుకుంటుందని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...