ఆర్‌సీబీ కంటే ఇక్కడే చాలా బాగుంది... వాషింగ్టన్ సుందర్ సెన్సేషనల్ కామెంట్...
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. టెస్టుల్లో టాప్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ టూర్‌లో గాయం కారణంగా జట్టుకి దూరమైన విషయం తెలిసిందే...

2017 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకి ఆడిన వాషింగ్టన్ సుందర్‌ని, ఐపీఎల్ 2018 సీజన్‌లో రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8.75 కోట్ల భారీ మొత్తానికి వాషింగ్టన్ సుందర్‌ని దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఐపీఎల్ 2022 ప్రిపరేషన్స్‌లో భాగంగా ఆరెంజ్ ఆర్మీలో చేరిన వాషింగ్టన్ సుందర్‌కి తనదైన స్టైల్‌లో స్వాగతం పలికింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్...
ఈ సందర్భంగా టి. నటరాజన్, తన సహచర తమిళనాడు ప్లేయర్‌ని కొన్ని ప్రశ్నలు వేశాడు. ‘ఇంతకుముందు ఆర్‌సీబీలో ఉన్నావు కదా... ఇప్పుడు ఆ టీమ్‌ని మిస్ అవుతున్నావా?’ అంటూ సుందర్‌ని ప్రశ్నించాడు నట్టూ...
దానికి వాషింగ్టన్ సుందర్, ఏ మాత్రం కంగారుపడకుండా ఠక్కున... ‘ఇక్కడే చాలా బాగుంది...’ అంటూ సమాధానం చెప్పాడు. ఈ సమాధానం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి మింగుడు పడడం లేదు...
ఇంతకుముందు ఆర్‌సీబీ ద్వారా వెలుగులోకి వచ్చిన కెఎల్ రాహుల్ కూడా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లిన తర్వాత ఇలాంటి కామెంట్లే చేశాడు...
‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉంటే అంత మంది స్టార్ల మధ్య ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా, స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా...’ అంటూ 2018లో కెఎల్ రాహుల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...
ఆ తర్వాత ఆర్‌సీబీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన షేన్ వాట్సన్ కూడా ఇలాంటి కామెంట్లే చేయడంతో అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఏముంది? ఎందుకు ప్లేయర్లు ఇంత ఇబ్బంది పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...
‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ఆశగా ప్రతీ ఏడాది తమ ఫెవరెట్ టీమ్... కప్పు గెలుస్తుందని ఆశపడే ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం, వాషింగ్టన్ సుందర్ కామెంట్లపై ఫైర్ అవుతున్నారు...
బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌గా ఉండడంతో వారిని కలిసిన ఆనందంలో వాషింగ్టన్ సుందర్ ఇలాంటి కామెంట్లు చేసి ఉండవచ్చని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...