MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీకి చెప్పిన అదే మాట, రోహిత్ శర్మకు చెప్పగలరా... రవిశాస్త్రికి మాథ్యూ హేడెన్ షాకింగ్ రిప్లై...

కోహ్లీకి చెప్పిన అదే మాట, రోహిత్ శర్మకు చెప్పగలరా... రవిశాస్త్రికి మాథ్యూ హేడెన్ షాకింగ్ రిప్లై...

ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. మొదటి 10 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీసిన జస్ప్రిత్ బుమ్రా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి.. రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 10 2022, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ కాగా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 బంతులాడి 2 పరుగులే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి షెల్డన్ జాక్సన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్...

210

రోహిత్ శర్మ బ్యాటుకి తగలకముందే స్పైక్ కనిపించినా థర్డ్ అంపైర్... అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. అయితే రోహిత్ ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచుల్లో కలిసి 200 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు..

310

విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లో 216 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే రోహిత్ కంటే విరాట్ కోహ్లీపైనే ఎక్కువగా ట్రోల్స్ వస్తుండడంపై ఫైర్ అయ్యాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్...

410

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ కామెంటేటర్ హర్షా భోగ్లే... ‘రవిశాస్త్రి, విరాట్ కోహ్లీకి బ్రేక్ కావాలని సూచించారు...’ అంటూ కామెంట్ చేశాడు...

510

దీనికి మాథ్యూ హేడెన్.. ‘అదే మాట రోహిత్ శర్మకు చెప్పగలడా? నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇద్దరూ గ్యాప్ లేకుండా టోర్నీలు ఆడుతూనే ఉన్నారు. వాళ్లకి కావాల్సిన మెంటల్ స్పేస్‌ని తీసుకుంటూనే ఉంటారు..

610

విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లుగా అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నారు. అతను ఆట అసాధారణంగా ఉంటుంది, క్రికెట్‌పై అతనికి ఉన్న ఇష్టం అతని ఆటలో కనిపిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక్క మూమెంట్ చాలు..

710

సెలక్టర్ల దగ్గరకి వెళ్లి నాకు బ్రేక్ కావాలని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఓ ఇన్నింగ్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగే ప్లేయర్‌లు చాలా తక్కువగా ఉంటారు. వాళ్లు ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి...

810

అయితే కొన్నిసార్లు చాలా చిన్న చిన్న తప్పిదాల కారణంగా అవుట్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవడం కూడా కష్టం. దాన్నే బ్యాడ్ ఫేజ్ అంటారు...
 

910

విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్, పుల్ షాట్స్ ఆడడంలో దిట్ట. వాటితోనే ఆయన మళ్లీ డేవిడ్ వార్నర్‌లా భీకరమైన ఫామ్‌లోకి వస్తాడని అనుకుంటున్నా...’ అంటూ సమాధానం ఇచ్చాడు...
 

1010

‘నేను రవిశాస్త్రి వ్యాఖ్యల గురించి చెప్పడానికి ప్రధాన కారణం వాళ్లిద్దరూ కొన్నేళ్ల పాటు కలిసి పనిచేశారు. టెస్టు క్రికెట్‌లో చాలా విజయాలు సాధించారు. విరాట్ ఇన్నర్ మైండ్ గురించి రవిశాస్త్రికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నా...’ అంటూ హేడెన్‌కి సమాధానం ఇచ్చాడు హర్షా భోగ్లే...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image3
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved