- Home
- Sports
- Cricket
- ఉమ్రాన్ మాలిక్ ఆశలపై నీళ్లు చల్లిన లూకీ ఫర్గూసన్... ఒకే బంతితో రూ.10 లక్షలు కొట్టేశాడు...
ఉమ్రాన్ మాలిక్ ఆశలపై నీళ్లు చల్లిన లూకీ ఫర్గూసన్... ఒకే బంతితో రూ.10 లక్షలు కొట్టేశాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలనం క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కి ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని నిరాశ ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, లీగ్ స్టేజీ నుంచి నిష్కమించింది. ప్లేఆఫ్స్‌కే రాని జట్టు, ఫైనల్ ఎలా ఆడుతుంది. మరి మాలిక్‌కి డిస్సప్పాయింట్‌మెంట్ ఎలా? ఎందుకు?...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 150+ కి.మీ.ల వేగంతో బంతులు విసురుతూ, ప్రతీ మ్యాచ్‌లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ కింద రూ.1 లక్ష కొల్లగొడుతూ వచ్చాడు ఉమ్రాన్ మాలిక్...
ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో చోటు దక్కించుకుని రూ.4 కోట్లు ఖాతాలో వేసుకున్న ఉమ్రాన్ మాలిక్, సీజన్‌లో 14 మ్యాచుల్లో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ కింద మరో రూ.14 లక్షలు దక్కించుకున్నాడు...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20వ ఓవర్‌లో 157 కి.మీ.ల వేగంతో బాల్ వేసిన ఉమ్రాన్ మాలిక్, మిగిలిన బౌలర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు... ఫైనల్ మ్యాచ్ దాకా ఈ రికార్డును ఎవ్వరూ అందుకోలేకపోయారు...
దీంతో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్’ కింద మరో రూ.10 లక్షలు, ఉమ్రాన్ మాలిక్ జేబులో చేరతాయని భావించారంతా. అయితే ఫైనల్ మ్యాచ్‌లో లూకీ ఫర్గూసన్, మాలిక్ ఆశలపై నీళ్లు చల్లాడు...
అల్జెరీ జోసఫ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన లూకీ ఫర్గూసన్, తన మొదటి ఓవర్ చివరి బంతికి 157.3 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి, మాలిక్ రికార్డును చెరిపివేశాడు.. దీంతో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్’ కింద రూ.10 లక్షల చెక్కు, ఫర్గూసన్ ఖాతాలోకి వెళ్లనుంది...
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో 2 వేల ఫోర్లు పూర్తయ్యాయి. 2013 సీజన్‌లో 2052 ఫోర్లు నమోదుకాగా, ఒకే సీజన్‌లో 2 వేలకు పైగా ఫోర్లు రావడం ఇది రెండోసారి మాత్రమే... ఈ సీజన్‌లో మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో 1000 సిక్సర్లు నమోదైన విషయం తెలిసిందే..