- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్... ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్‌కి కరోనా! 2021 సీన్ రిపీట్ అవుతుందా?
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్... ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్‌కి కరోనా! 2021 సీన్ రిపీట్ అవుతుందా?
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై రెండు వారాలు దాటింది. ఈసారి అటు 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ , ఇటు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ఢీలా పడిపోతే... మిగిలిన టీమ్‌లు అదరగొడుతున్నాయి...

మూడు రోజుల కిందట ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఢిల్లీ ప్లేయర్లకు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది...
ఈ సంఘటన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా ఆడింది. అయితే తాజాగా ఢిల్లీ బృందంలో ఓ ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం...
షెడ్యూల్ ప్రకారం ఇన్నాళ్లు ముంబైలో మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడేందుకు పూణే వెళ్లాల్సి ఉంది. అయితే ఓ ప్లేయర్‌కి కరోనా రావడంతో ఈ ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.
కరోనా సోకిన ప్లేయర్‌ని ఐసోలేషన్‌కి పంపిన ఐపీఎల్ నిర్వహకులు, మిగిలిన ప్లేయర్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. మ్యాచ్‌కి మరో రోజు మాత్రమే ఉండడంతో షెడ్యూల్ ప్రకారం అది జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...
ఐపీఎల్ 2021లో సరిగ్గా 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో సీజన్ మొత్తాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. నిన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో 29వ మ్యాచ్...
దాంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫలితాలే రిపీట్ అవుతాయా? అని ఐపీఎల్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఆటగాళ్ల భధ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్‌ని వెంటనే క్యాన్సిల్ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అభిమానులు డిమాండ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు..